Shah Rukh Khan : అనిరుధ్ నా కొడుకు లాంటోడు

న‌టుడు షారుక్ ఖాన్ కామెంట్

Shah Rukh Khan : బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను న‌టించిన జ‌వాన్ ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 7న విడుద‌ల కానుంది. ఈ చిత్రానికి త‌మిళ సినీ రంగానికి చెందిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందించారు.

Shah Rukh Khan Appreciates Anirudh

ప్ర‌స్తుతం ఈ మూవీ పాట‌లు టాప్ లో కొన‌సాగుతున్నాయి. క్రియేటివ్, యంగ్ డైన‌మిక్ డైరెక్ట‌ర్ అట్లి కుమార్ జ‌వాన్ కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెల‌కొన్నాయి. షారుక్ ఖాన్(Shah Rukh Khan ) భార్య పేరుతో జ‌వాన్ ను నిర్మించారు.

రూ. 200 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేశారు ఈ మూవీకి. వ‌ర‌ల్డ్ వైడ్ గా మార్కెట్ లో దుమ్ము రేపింది. ఓవ‌ర్సీస్ లో అత్య‌ధికంగా ముంద‌స్తుగా వ‌సూళ్లు సాధించింది. ఇప్ప‌టికే రూ 350 కోట్ల‌కు పైగా జ‌వాన్ వసూలు చేసింది. దీంతో బాద్ షా షారుక్ ఖాన్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

జ‌వాన్ కు అద్భుత‌మైన మ్యూజిక్ అందించిన యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద‌ర్ కు కితాబు ఇచ్చాడు. అత‌డు త‌న‌కు కొడుకు లాంటోడ‌ని పేర్కొన్నాడు బాద్ షా షారుక్ ఖాన్.

Also Read : Salaar Trailer : స‌లార్ ట్రైల‌ర్ అప్ డేట్

Comments (0)
Add Comment