Sharwanand : దమ్మున్న డైరెక్టర్ సంపత్ నందితో జత కట్టాడు హీరో శర్వానంద్. నేచురల్ స్టార్ నాని స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. తను కూడా తన స్టైల్ ను మార్చేశాడు. తాజాగా రిలీజ్ అయిన హిట్ 3లో హింసను హైలెట్ చేశాడు దర్శకుడు. ఇక తాజాగా శర్వానంద్ కూడా నాని బాటలో నడుస్తున్నట్టు అనిపించింది. తాజాగా కీలక అప్ డేట్ వచ్చింది తన నుంచి. శర్వానంద్ 38 పేరుతో టైటిల్ ను ఖరారు చేశారు మూవీ మేకర్స్.
Sharwanand Movie Updates
చార్మింగ్ స్టార్ గా శర్వానంద్(Sharwanand) కు పేరుంది. ప్రస్తుతం తను నటించిన సినిమాలు ఆడక పోయినా బిజీగా ఉన్నాడు. సినీ విమర్శకులను విస్తు పోయేలా చేసింది. ఇదే సమయంలో నారీ నారీ నడుమ మురారీ మూవీలో నటిస్తున్నాడు. ఇద్దరి ముద్దుగుమ్మల మధ్య నలిగి పోయే పాత్ర. గతంలో సతీష్ వేగ్నేష దర్శకత్వంలో వచ్చిన శతమానం భవతి మూవీ లో నటించాడు. తనతో పాటు అనుపమ పరమేశ్వరన్ కీ రోల్ పోషించింది. ఫీల్ గుడ్ కలిగించిన చిత్రం ఇది.
తాజాగా తన స్టైల్ ను పూర్తిగా మార్చేశాడు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించేందుకు రెడీ అయ్ఆయడు సంపత్ నంది. ఇక ఈ ప్రాజెక్టు హై బడ్జెట్ పీరియాడికల్ డ్రామాగా తీస్తున్నట్లు టాలీవుడ్ లో టాక్. ఈ మూవీలో శర్వానంద్ తో మరోసారి జత కట్టనుంది అనుపమ పరమేశ్వరన్. ఈ విషయాన్ని దర్శకుడు వెల్లడించాడు. తనతో పాటు మరో నటి డింపుల్ హయతి కూడా భాగం కానుందని వెల్లడించారు. శర్వా సంపత్ బ్లడ్ గా రానున్న ఈ మూవీపై ఉత్కంఠ రేపుతోంది.
Also Read : Samantha Challenge :సవాళ్లు స్వీకరిస్తేనే సక్సెస్ సాధ్యం