Shatrughan Sinha: సోనాక్షి పెళ్లి రూమర్స్‌ స్పందించిన తండ్రి శతృఘ్న సిన్హా !

సోనాక్షి పెళ్లి రూమర్స్‌ స్పందించిన తండ్రి శతృఘ్న సిన్హా !

Shatrughan Sinha: ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ సోషల్‌ మీడియా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బాల్‌ తో సోనాక్షి వివాహం జరగనుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తన కూతురి వివాహంపై వచ్చిన రూమర్స్‌ పై బాలీవుడ్ సీనియర్ నటుడు శతృఘ్నసిన్హా(Shatrughan Sinha) స్పందించారు. వారిద్దరి ప్రేమాయణం గురించి ఇప్పటివరకు తనకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు.

Shatrughan Sinha Marriage..

‘‘సోనాక్షి వివాహం చేసుకోనుందని ప్రచారం జరుగుతోంది. కానీ, దాని గురించి నా దగ్గర ఎలాంటి సమాచారం లేదు. ఈ విషయం మీడియాకు కూడా తెలుసని… మీ కూతురి వివాహం గురించి మీకు తెలియదా అని చాలామంది నన్ను అడిగారు. నిజంగా నాకు ఈ విషయం గురించి తెలియదు. ఎందుకంటే సోనాక్షి ఇప్పటివరకు నాకేమీ చెప్పలేదు. ఒకవేళ నా కూతురి వివాహం జరిగితే… బారాత్‌ ముందు డాన్స్‌ చేయడానికి రెడీగా ఉన్నా’’ అని శతృఘ్నసిన్హా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

‘‘మొత్తంగా నేను చెప్పేది ఒక్కటే… ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల అనుమతి కోరడం లేదు. కేవలం సమాచారం ఇస్తున్నారు అంతే. ఇందుకోసం వేచిచూస్తున్నాం. సోనాక్షి నిర్ణయంపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. అదే నిజమైతే… ఆ జంటను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నా’’ అని అన్నారు. సోనాక్షి, జహీర్ కొన్నేళ్ల నుంచి డేటింగ్‌లో ఉంటున్నారని వదంతులు వచ్చాయి. జూన్‌ 23న వీరిద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ముంబయిలో జరగబోయే ఈ వివాహానికి ఇప్పటికే హీరామండి చిత్ర బృందం సహా పలువురు సన్నిహితులు, ప్రముఖులకు ఆహ్వానం అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే శతృఘ్న సిన్హా తాజాగా స్పందించారు.

Also Read : Euphoria : మరో కొత్త సంగీత దర్శకుడికి అవకాశమిచ్చిన గుణశేఖర్

Shatrughan SinhaSonakshi Sinha
Comments (0)
Add Comment