Shivangi Sensational :వ‌ర‌ల‌క్ష్మి ‘శివంగి’ ఆహా త‌మిళ ఓటీటీలో రెడీ

కీల‌క పాత్ర‌లో న‌టించిన ఆనంది

Shivangi : త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో వెరీ స్పెష‌ల్ వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్. తండ్రి చాటు బిడ్డ‌ను కాద‌ని త‌న‌ను తాను ప్రూవ్ చేసుకుంది. న‌టిగా, ప్ర‌తి నాయ‌కురాలిగా ప‌లు పాత్ర‌లు పోషించింది. ఇటీవ‌లే పెళ్లి చేసుకుంది. వ‌రుస‌గా సినిమాల‌లో ఛాన్స్ లు వ‌స్తున్నాయి. ఇటు త‌మిళంలో అటు తెలుగులో. మాస్ మ‌హారాజా మూవీలో విల‌న్ పాత్ర పోషించింది అంద‌రినీ ఆశ్చ‌ర్య పోయేలా చేసింది. ఇటీవ‌లే విశాల్ తో క‌లిసి చేసిన మూవీ విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది.

Varalaxmi Sarathkumar’s Shivangi Movie OTT Updates

తాజాగా త‌న‌తో పాటు ఆనంది క‌లిసి న‌టించిన చిత్రం శివంగి(Shivangi) ల‌య‌నెస్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మంచి స్పంద‌న ల‌భించింది. అన్ని వ‌ర్గాల అభిమానుల‌ను ఆక‌ట్టుకుంది. నిర్మాత‌కు పెట్టిన డ‌బ్బులు వ‌చ్చేలా చేసింది. ద‌ర్శ‌కుడు సినిమాను కొత్త కాన్సెప్ట్ తో తీయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. ప్రేక్ష‌కుల‌కు మంచి ఫీల్ గుడ్ ను అందించింది. ఈ సినిమాకు దేవ‌రాజ్ భ‌ర‌ణి ద‌ర్శ‌కత్వం వ‌హించాడు. ఈ మూవీ ఈ ఏడాది మార్చి 7న రిలీజ్ అయ్యింది. బాక్సాఫీస్ వ‌ద్ద మిశ్ర‌మ స్పంద‌న అందుకుంది. ప్ర‌స్తుతం ఓటీటీ కోసం అభిమానులు వేచి చూస్తున్నారు.

దీంతో శివంగి ల‌య‌నెస్ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుంద‌ని ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్స్ కు తీపి క‌బురు చెప్పింది ఆహా ఓటీటీ సంస్థ‌. ఈ మేర‌కు ఏప్రిల్ 18న ఆహా త‌మిళంలో స్ట్రీమింగ్ కానుంద‌ని అధికారికంగా ప్ర‌క‌టించింది. స‌హ‌జ‌త్వానికి ద‌గ్గ‌ర‌గా ఉండే పాత్ర‌లు, ఉత్కంఠ రేపే స‌న్నివేశాలు, ఆలోచింప చేసే డైలాగులు..వెర‌సి సినిమా ప్ర‌తి ఒక్క‌రిని అల‌రిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read : Good Bad Ugly Shocking :గుడ్ బ్యాడ్ అగ్లీ నిర్మాత‌ల‌కు ఇళ‌య‌రాజా షాక్

CinemaOTTShivangiTrendingUpdatesVaralakshmi Sarathkumar
Comments (0)
Add Comment