Shobhitha Shocking :ప్రెగ్నెన్సీ అనేది పూర్తిగా అబ‌ద్దం – శోభిత‌

స్ప‌ష్టం చేసిన న‌టుడు అక్కినేని నాగ‌చైత‌న్య

Shobhitha : న‌టి శోభిత ధూళిపాళ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తాజాగా త‌ను గ‌ర్భం దాల్చిన‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. సోష‌ల్ మీడియాలో త‌న‌కు సంబంధించిన ఫోటోలు వైర‌ల్ గా మారాయి. ప్రెగ్నెన్సీ అనేది పూర్తిగా అబ‌ద్ద‌మ‌ని స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉండ‌గా అక్కినేని నాగ‌చైత‌న్య శోభిత ధూళిపాళ(Shobhitha) క‌లిసి ఐదు నెల‌లు అయ్యింది పెళ్లి జ‌రిగి. తాను ప్రెగ్నెన్సీ అయిన‌ట్లు అవాస్త‌వ‌మ‌ని పేర్కొంది. కొత్త‌గా పెళ్ల‌యిన జంట‌లపై పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌ర‌గ‌డం మామూలై పోయిందంటూ వాపోయింది శోభిత ధూళిపాళ‌.

Shobhitha Dhulipala Shocking Comments

ఇదిలా ఉండ‌గా మెగాస్టార్ కోడ‌లు లావ‌ణ్య త్రిపాఠి గ‌ర్భ‌వ‌తి అని కూడా ప్ర‌చారం జ‌రిగింది. దీంతో ప్రెగ్నెన్సీ అనేది పూర్తిగా అబ‌ద్ద‌మంటూ కొట్టి పారేసింది. అయితే తాజాగా త‌న భ‌ర్త‌, న‌టుడు వ‌రుణ్ తేజ్ ఓపెన్ అప్ అయ్యారు. త‌న భార్య క‌డుపుతో ఉంద‌ని, త్వ‌ర‌లోనే మ‌రో ప్రాణం బ‌య‌ట‌కు రానుందంటూ తెలిపాడు. ఈ విష‌యం సోష‌ల్ మీడియాను షేక్ చేసింది.

ప్రస్తుతం శోభిత తన వైవాహిక జీవితం ఆస్వాదిస్తోందని, మాతృ త్వంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీమ్ క్లారిటీ ఇచ్చింది. పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ‌ నిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్ ను పలక రిస్తోంది. ఇక నాగచైతన్య పెళ్లి తర్వాత ‘తండేల్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మైథాలాజికల్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు.

Also Read : Beauty Samantha :అంత‌టా శుభం స‌మంత సంతోషం

CommentsShockingSobhita DhulipalaViral
Comments (0)
Add Comment