Beauty Shraddha Kapoor -Neel :ప్ర‌శాంత్ నీల్ మూవీలో శ్ర‌ద్దా క‌పూర్

జోరుగా సినీ ఇండస్ట్రీలో ప్ర‌చారం

Shraddha Kapoor : ద‌మ్మున్న హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్. డైన‌మిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌స్తున్న మూవీ డ్రాగ‌న్. ఇప్ప‌టికే టైటిల్ ఖ‌రారు చేశారు. షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అంచ‌నాలు భారీగా పెరిగాయి. క‌ర్ణాట‌క ప్రాంతాల‌లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు ద‌ర్శ‌కుడు. ఇక త‌ను తీసిన కేజీఎఫ్ దేశాన్ని ఒక ఊపు ఊపింది. ఆ త‌ర్వాత ప్ర‌భాస్ తో తీసిన స‌లార్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. త‌న టేకింగ్ మేకింగ్ డిఫ‌రెంట్ గా ఉండ‌డంతో త‌ను తీస్తున్న చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

Shraddha Kapoor in Prasanth Neel Movie

ఇప్ప‌టికే ఎవ‌రూ ఊహించ‌ని మార్కెట్ లో డిమాండ్ ఏర్ప‌డింద‌ని టాక్. ఇది ప‌క్క‌న పెడితే ఎవ‌రిని తార‌క్ స‌ర‌స‌న హీరోయిన్ గా తీసుకుంటార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. కొంద‌రు జాన్వీ క‌పూర్ అని అంటే మ‌రికొంద‌రు టాప్ హీరోయిన్లను తీసుకునే దానికంటే కొత్త వారికి ఛాన్స్ ఇస్తే బావుంటుంద‌ని ఆలోచిస్తున్న‌ట్లు స‌మాచారం.

తాజాగా డ్రాగ‌న్ మూవీకి సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. అదేమిటంటే సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. బాలీవుడ్ కు చెందిన ల‌వ్లీ బ్యూటీ శ్ర‌ద్దా క‌పూర్(Shraddha Kapoor) డ్రాగ‌న్ చిత్రంలో తార‌క్ తో తెర ను పంచుకోనుంద‌ని టాక్. ఏది ఏమైనా ప్ర‌శాంత్ నీల్ చేతిలో ప‌డితే ఎవ‌రైనా స‌రే పాత్ర‌లో ఇమిడి పోవాల్సిందే. లేక పోతే త‌న‌తో చాలా క‌ష్టం. త‌ను అనుకున్న‌ది వ‌చ్చేంత వ‌ర‌కు విడిచి పెట్ట‌డు. మ‌రి ఈ అందాల ముద్దుగుమ్మ న‌టిస్తుందా లేదా అన్న దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు ప్ర‌శాంత్ నీల్.

Also Read : Bhairavam Song Sensational :భైర‌వం మూవీ సాంగ్ రిలీజ్

CinemaJr NTRprasanthneelShraddha KapoorTrendingUpdates
Comments (0)
Add Comment