Shraddha Srinath : ఈ మధ్య తెగ వైరల్ అవుతున్న క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన శ్రద్ధ

‘ క్యాస్టింగ్‌ కౌచ్‌పై పలువురు పలు విధాలుగా మాట్లాడుతున్నారు...

Shraddha Srinath : ఇటీవలికాలంలో చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ అంశం పెను ప్రకంపనలు రేపుతోంది. ఈ అంశంపై అనేక మంది స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా కథానాయకి శ్రద్ధా శ్రీనాథ్ స్పందించారు. ‘ క్యాస్టింగ్‌ కౌచ్‌పై పలువురు పలు విధాలుగా మాట్లాడుతున్నారు. అయితే, నా విషయానికి వస్తే మాత్రం ఎలాంటి చేదు అనుభవం లేదా సంఘటనలు ఎదుర్కోలేదు. నిజం చెప్పాలంటే సినిమాల కంటే బాహ్య ప్రపంచంలోనే మహిళలకు రక్షణ కరువైంది. సినీ ఇండస్ట్రీలో సంఘటనలు జరగడం లేదని, సమాజంలోనే మహిళలపై అధిక సంఖ్యలో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. ఏదేని కార్యక్రమంలో పాల్గొని కారులో వెళ్ళే సమయంలో ఆ కారు డ్రైవర్‌ ఎలా ప్రవర్తిస్తాడోనన్న భయంతో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నాను.

Shraddha Srinath Comment

ఒక్కమాటలో చెప్పాలంటే సమాజంలో సౌకర్యవంతంగా, సహజసిద్ధంగా ప్రయాణించ లేకపోతున్నాను’ అని పేర్కొన్నారు. అయితే ఈ భామ తెలుగులో నానితో జ‌ర్సీ, వెంక‌టేశ్ సైంధ‌వ్ సినిమాల్లో న‌టించింది.

Also Read : Kumari Aunty : వరద బాధితుల కోసం తన వంతు సాయాన్ని సీఎంకు అందించిన కుమారి ఆంటీ

Breakingcasting coutchShraddha SrinathUpdatesViral
Comments (0)
Add Comment