తమిళ సినీ రంగంలో మోస్ట్ పాపులర్ కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది దర్శకుడు మణిరత్నం, ఇలయ నాయగన్ ( లోక నాయకుడు) కమల్ హాసన్ అని చెప్పక తప్పదు. ఈ ఇద్దరు 38 ఏళ్ల కిందట నాయకుడు సినిమా తీశారు. ఇది ముంబైలో జరిగిన యధార్థ ఘటన ఆధారంగా తెరకెక్కించాడు. ఆ తర్వాత సుదీర్ఘ విరామం (గ్యాప్ ) తర్వాత తిరిగి కలిశారు. ఇద్దరూ బంధువులు కూడా అవుతారు. నటి సుహాసినికి కమల్ హాసన్ చిన్నాన్న అవుతాడు. ఆమె మణిరత్నం భార్య.
ఇక టాప్ హీరోయిన్ గా అభిమానుల మనసు దోచుకున్న విలక్షణ నటి శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంటుంది. తను సినిమాలలో బిజీగా ఉంది. తన తండ్రి కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం మణిరత్నం తీసిన థగ్ లైఫ్. ఈ సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఇలయ నాయగన్ స్వయంగా సినిమాకు కథ రాశాడు. అంతే కాదు ఓ పాటకు ప్రాణం పోశాడు. దీనికి స్వరాలు కూర్చాడు ఆస్కార్ అవార్డు విన్నర్ అల్లా రఖా రెహమాన్.
ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు హెవీ రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్బంగా మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. జూన్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఇలయ నాయగన్ నటించిన థగ్ లైఫ్ ప్రేక్షకుల ముందుకు రానుందని. దీంతో ఫ్యాన్స్ దీని కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా సినిమా ఆడియో లాంచింగ్ జరిగింది. ముఖ్య అతిథిగా శ్రుతి హాసన్ హాజరైంది. తన తండ్రి లోక నాయకుడికి తిరుగు లేదంటూ పేర్కొంది. ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇక థగ్ లైఫ్ లో కమల్ హాసన్ తో పాటు త్రిష కృష్ణన్, సిలాంబరసన్ నటించారు.