Shruti Haasan Shocking :నాన్నే నా లోకం లేక‌పోతే శూన్యం 

శ్రుతి హాస‌న్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ 

Shruti Haasan : ప్ర‌ముఖ న‌టి శ్రుతి హాస‌న్ త‌న తండ్రి క‌మ‌ల్ హాస‌న్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో థ‌గ్ లైఫ్ మూవీ రాబోతోంది. ఇందులో క‌మ‌ల్ హాస‌న్ , త్రిష కృష్ణ‌న్, సిలాంబ‌ర‌స‌న్ ముఖ్య పాత్ర‌లు పోషించారు. ఈ సంద‌ర్బంగా త‌న తండ్రి గురించి గొప్ప‌గా చెప్పింది. త‌నే నా ప్ర‌పంచమ‌ని, ఆయ‌న లేక పోతే త‌ను పూర్తిగా నిరాశ‌కు లోన‌వుతున్న‌ట్లు తెలిపింది. ఇదిలా ఉండ‌గా థ‌గ్ లైఫ్ కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ప్ర‌త్యేకించి పొన్నియ‌న్ సెల్వ‌న్ మూవీ త‌ర్వాత వ‌స్తున్న చిత్రం కావ‌డంతో అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి.

Shruti Haasan Shocking Comments

ఈ సంద‌ర్బంగా న‌టి శ్రుతి హాస‌న్(Shruti Haasan) త‌న తండ్రి క‌మ‌ల్ హాస‌న్ తో క‌లిసి ఉన్న ఫోటోల‌ను పంచుకుంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు హ‌ల్ చ‌ల్  చేస్తున్నాయి. నా కాంతి, బ‌లం , మూలం నా తండ్రేనంటూ పేర్కొంది న‌టి. నాకంటే ఎక్కువ‌గా త‌న‌ను ప్రేమిస్తున్నానంటూ తెలిపింది. నా స్వేచ్ఛ‌కు ఎలాంటి భంగం లేకుండా ప్రోత్స‌హించినందుకు, నా వెంటే ఉన్నందుకు ఎల్ల‌ప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను నాన్నా అని తెలిపింది శ్రుతి హాస‌న్. ఈ సంద‌ర్బంగా సినీ ప్ర‌ముఖులు పెద్ద ఎత్తున స్పందించారు.

సుచిత్ర పిళ్లై అయితే వెంట‌నే స్పందించింది. ఈ సంద‌ర్బంగా తండ్రీ కూతురి గురించి ఆస‌క్తిక‌ర పోస్ట్ చేసింది. దేవుడు మీ ఇద్ద‌రినీ త‌ప్ప‌కుండా ఆశీర్వ‌దిస్తాడు. మీరు క‌ల‌కాలం ఇలాగే ఉండాల‌ని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. న‌టుడు సిద్దార్థ్ పి మ‌ల్హోత్రా అయితే ది బెస్ట్ విద్ ది బెస్ట్ అని స్ప‌ష్టం చేశారు. మిమ్మ‌ల్ని చూస్తే గ‌ర్వంగా ఉంద‌న్నారు. ఇదిలా ఉండ‌గా క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌స్తుతం త‌న సినిమా థ‌గ్ లైఫ్ ని  ప్ర‌మోట్ చేస్తున్నాడు. కాగా  1987లో మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో నాయ‌కుడు త‌ర్వాత న‌టిస్తున్న చిత్రం కావ‌డం విశేషం.

Also Read : Hero Vijay Thalapathy-Subbaraju :విజ‌య్ కి క‌థ‌లు చెప్పినా వ‌ర్క‌వుట్ కాలేదు

CommentsKamal HaasanShruti HaasanViral
Comments (0)
Add Comment