Hero Thalapathy Vijay : ద‌ళ‌ప‌తి స‌ర‌స‌న క్రేజీ హీరోయిన్

పూజా హెగ్డేతో పాటు శృతీ హాస‌న్

Thalapathy Vijay : త‌మిళ సినీ సూప‌ర్ స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్ ప్ర‌స్తుతం త‌న చివ‌రి చిత్రం ద‌ళ‌ప‌తి 69లో న‌టిస్తున్నాడు. ఈ మూవీకి నాయ‌గ‌న్ అని పేరు పెట్టాడు ద‌ర్శ‌కుడు హెచ్ వినోద్. ఈ మ‌ధ్య‌నే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. త‌న కెరీర్ లో ఇదే ఆఖ‌రిది అని పేర్కొన్నాడు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో పాలిటిక్స్ లోకి ఎంట‌ర్ అయ్యాడు. కొత్త పార్టీని ప్ర‌క‌టించాడు విజ‌య్.

Thalapathy Vijay Movie with Shruti Haasan

ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ లో బిజీగా మారాడు. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇంకా రిలీజ్ కాకుండానే ఓవ‌ర్సీస్ లో 75 కోట్ల‌కు పైగా ప‌లికింది. ప్ర‌స్తుతం నాయ‌గ‌న్ మూవీలో కీల‌క‌మైన ఫిమేల్ రోల్ లో న‌టిస్తోంది బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే.

తాజాగా ఈ మూవీకి సంబంధించి కీల‌క‌మైన అప్ డేట్ ఇచ్చారు మూవీ మేక‌ర్స్. ద‌ళ‌పతి విజ‌య్ స‌ర‌స‌న మ‌రో క్రేజీ హీరోయిన్ న‌టిస్తోంది. ఆమె ఎవ‌రో కాదు దిగ్గ‌జ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ముద్దుల కూతురు శృతీ హాస‌న్ క‌న్ ఫ‌ర్మ్ అయ్యింది. దీంతో రెండోసారి విజ‌య్ తో క‌లిసి న‌టించ‌నుంది ఈ అమ్మ‌డు. గ‌తంలో త‌ను విజ‌య్ తో క‌లిసి పులి మూవీలో న‌టించింది. ఇప్పుడు ద‌ళ‌పతితో క‌లిసి న‌టిస్తున్న చిత్రం రెండోది.

Also Read : Hero Chai- Thandel :తండేల్ చిత్రానికి ద‌ర్శ‌కేంద్రుడు ఫిదా

CinemaNayaganShruti HaasanThalapathy VijayTrendingUpdates
Comments (0)
Add Comment