Shruti Marathe: ‘దేవర’లో తన పాత్ర రివీల్‌ చేసిన గుజరాతీ బ్యూటీ !

'దేవర'లో తన పాత్ర రివీల్‌ చేసిన గుజరాతీ బ్యూటీ !

Shruti Marathe: స్టైలిష్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘దేవర’. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరాఠీ, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్న గుజరాతీ భామ శ్రుతీ మరాఠే ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. రెండు పార్టులుగా విడుదల చేస్తున్న ఈ సినిమాను అక్టోబరు 10న మొదటి పార్టును విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ కు విపరీతమైన స్పందన వచ్చింది. ఇటీవలే హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా… ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరపుకుంటోంది.

Shruti Marathe Comments Viral

అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తోన్న గుజరాతీ బ్యూటీ శ్రుతీ మరాఠే(Shruti Marathe) తన పాత్రను రివీల్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రుతీ మాట్లాడుతూ… ‘దేవరలో సినిమాలో నా షూటింగ్ పార్టులో కొంతబాగం ఇటీవలే హైదరాబాద్ లో పూర్తయింది. అందులో నేను దేవరకు భార్యగా కనిపిస్తాను. అక్టోబర్‌ 10న పాన్‌ ఇండియా రేంజ్‌ లొ ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్‌ అభిమానుల మాదిరే నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.’ అని చెప్పారు. ఈ సినిమాలో జాన్వీకపూర్‌ తంగం అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీనితో దేవరలో ఇద్దరు హీరోయిన్లు అనే విషయం క్లారిటీ వచ్చేసింది. ఇందులో ఎన్టీఆర్‌ డబుల్‌ రోల్‌లో నటిస్తున్న విషయం దాదాపు ఖాయం అని తేలిపోయింది. మరోవైపు ఈ మూవీ షూట్‌ కు సంబంధించిన జూనియర్ ఎన్టీఆర్ లుక్‌ నెట్టింట తెగ వైరలవుతోంది. ఇది చూసిన అభిమానులు దేవర లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Padmavibhusan Chiranjeevi: పద్మవిభూషణుడికి సౌత్‌ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌ ‘చిరు’ సత్కారం !

DevaraNTRShruti Marathe
Comments (0)
Add Comment