Hero Siddharth-Miss You : ఓటీటీలో సిద్దార్థ్..ఆషికా మిస్ యూ

విడుద‌ల చేసిన అమెజాన్ ప్రైమ్..

Siddharth : విల‌క్ష‌ణ న‌టుడిగా గుర్తింపు పొందిన సిద్దార్థ్(Siddharth) ఆషికా రంగ‌నాథ్ తో క‌లిసి న‌టించిన మిస్ యూ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి వ‌చ్చేసింది. ఈ చిత్రం గ‌త ఏడాది డిసెంబ‌ర్ 13న తెలుగులో రిలీజ్ అయ్యింది. కానీ ఆశించిన మేర ఆద‌ర‌ణ చూర‌గొన‌లేదు. క‌థ‌నం , తీసే విధానం బాగున్న‌ప్ప‌టికీ ఎందుక‌నో ప్రేక్ష‌కులు న‌చ్చ‌లేదు.

ఇదే స‌మ‌యంలో అమెజాన్ ప్రైమ్ మిస్ యూ మూవీని కొనుగోలు చేసింది. దీనిని ఓటీటీ వేదిక‌గా విడుద‌ల చేసింది. ఇప్ప‌టికే క‌ల‌థిల్ సంతిప్పోమ్, మాప్లా సింగం మూవీల ద్వారా పేరు పొందిన ద‌ర్శ‌కుడు ఎన్ .రాజ‌శేఖ‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు.

Hero Siddharths Miss You Movie Updates

ప్రైమ్ లో తెలుగు, త‌మిళ భాష‌ల్లో అందుబాటులోకి వ‌చ్చింది. ఇక సిద్దార్థ్, ఆషికా రంగ‌నాథ్ ల‌కు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. ఓటీటీలో ఈ మూవీని త‌ప్ప‌క ఆద‌రిస్తార‌ని అమెజాన్ ప్రైమ్ భావిస్తోంది. మొత్తంగా డిజిట‌ల్ ప్లాట్ ఫార‌మ్ లో ఏ మేర‌కు రాణిస్తుంద‌నేది ఉత్కంఠ రేపుతోంది.

ఇక సిద్దార్థ్ అంటేనే తెలుగు వారి లోగిళ్ల‌లో త‌మ ఇంటివాడిగా భావిస్తారు. దిల్ రాజు నిర్మించిన భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బొమ్మ‌రిల్లు మూవీ గుర్తుకు వ‌స్తుంది. ఇక సిద్దార్థ్ త‌మిళం, తెలుగు, హిందీ సినిమాల‌లో న‌టించాడు. బాయ్స్ , నువ్వొస్తానంటే నేనొద్దంటానా, చుక్క‌ల్లో చంద్రుడు, రంగ్ దే బ‌సంతి, కొంచెం ఇష్టం కొంచెం క‌ష్టం, ఓయ్ , స్ట్రైక‌ర్ , అన‌గ‌న‌గా ఓ ధీరుడు, ఓ మై ఫ్రెండ్ , ల‌వ్ ఫెయిల్యూర్ , మిడ్ నైట్ చిల్ట్ర‌న్ , జ‌బ‌ర్ ద‌స్త్ , బాద్ షా , చ‌ష్మే బ‌ద్దూర్ , ఎన్ హెచ్ 4, జిగ‌ర్దండా , త‌దిత‌ర వాటిలో న‌టించాడు.

Also Read : Hero Rajinikanth : త్వ‌ర‌లోనే త‌లైవా బ‌యోపిక్ తీస్తా

CinemaOTTSiddharthTrendingUpdates
Comments (0)
Add Comment