Hero Jonnalagadda-Telusu Kada :జొన్న‌ల‌గ‌డ్డ ‘తెలుసు క‌దా’

జాక్ డిజాస్ట‌ర్ తో జొన్న‌ల‌గ‌డ్డ

Telusu Kada : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో యూత్ స్టార్ జొన్న‌ల‌గడ్డ సిద్దు, వైష్ణ‌వి చైత‌న్య క‌లిసి న‌టించిన చిత్రం జాక్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆశించిన మేర ఆడ‌క పోగా పూర్తిగా నిరాశ ప‌రిచింది. ఈ సినిమాపై పూర్తి న‌మ్మ‌కం పెట్టుకున్న హీరో, హీరోయిన్ల‌కు కోలుకోలేని షాక్ త‌గిలింది. దీనిపై ఎలాంటి కామెంట్స్ చేయ‌లేదు. క‌థను ప్రేక్ష‌కుల వ‌ద్ద‌కు తీసుకు వెళ్ల‌డంలో స‌క్సెస్ కాలేక పోయామ‌న్నాడు. అయితే సినిమా రిలీజ్ కంటే ముందే త‌న‌కు కొన్ని అనుమానాలు కూడా ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది.

Siddu Jonnalagadda- Telusu Kada Movie Updates

స్టార్ ఇమేజ్ తో సంబంధం లేకుండా బ‌ల‌మైన కంటెంట్ ప్రేక్ష‌కుల‌తో నిజంగా క‌నెక్ట్ కాగ‌ల‌మ‌ని గ్ర‌హించాడు. ఓ వైపు జాక్ ఫెయిల్ అయినా త‌న‌కు మ‌రో సినిమాలో న‌టించే అవ‌కాశం ల‌భించింది. అంద‌రి దృష్టి త‌న‌పై ప‌డింది. తెలుసు క‌దా అనే మూవీకి సంత‌కం చేశాడు. ఇవాళ షూటింగ్ ప్రారంభ‌మైంది. దీనిని పూర్తిగా రొమాంటిక్, కామెడీ గా తెర‌కెక్కించ‌నున్నారు. నీర‌జ్ కోన ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమా జొన్న‌ల‌గడ్డ సిద్దుకు కొత్త స‌వాల్ గా మారింది.

మ‌రో వైపు ఈ చిత్రంపై అంచ‌నాలు ఎక్కువ‌గా ఉన్నాయి. హీరో కెరీర్ కు కీల‌క‌మైన ప‌రీక్ష‌గా మారుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ సంద‌ర్బంగా కంటెంట్ ప‌రంగా బ‌లంగా ఉంద‌ని పేర్కొన్నాడు ద‌ర్శ‌కుడు. ఇది పూర్తిగా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా తీర్చి దిద్దుతున్నామ‌ని చెప్పాడు.

Also Read : Beauty Tamannaah Odela 2 vs Kesari :వేస‌వి వేళ సినిమాలు క‌ళ‌క‌ళ‌

CinemaSiddu JonnalagaddaTelusu KadaUpdatesViral
Comments (0)
Add Comment