Hero Silambarasan :త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుంటాన‌న్న సిలాంబ‌ర‌స‌న్

థ‌గ్ లైఫ్ సినిమా ప్ర‌మోష‌న్ లో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌

Silambarasan : పెళ్లిపై మౌనం వీడారు శింబు అలియాస్ సిలాంబ‌ర‌స‌న్(Silambarasan). త‌న తండ్రి మోస్ట్ పాపుల‌ర్ డైరెక్ట‌ర్ కూడా. ఇక శింబుకు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. త‌ను వెరీ వెరీ స్పెష‌ల్. డిఫ‌రెంట్ మేన‌రిజంకు త‌ను పెట్టింది పేరు. త‌ను కీల‌క పాత్ర పోషించాడు థ‌గ్ లైఫ్ చిత్రంలో. దీనికి భార‌త దేశంలో పేరు పొందిన దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం తీశాడు. పొన్నియ‌న్ సెల్వ‌న్ మూవీ సీక్వెల్ త‌ర్వాత వ‌స్తున్న మూవీ కావ‌డంతో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

Silambarasan Marriage Updates

ఈ చిత్రానికి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. అదేమిటంటే జ‌న నాయ‌గ‌న్ గా పిలుచుకునే క‌మ‌ల్ హాసన్ సినిమా కోసం ప్ర‌త్యేకంగా క‌థ రాశాడు. అంతే కాదు పాట కూడా రాయ‌డం విశేషం. థ‌గ్ లైఫ్ లో కీ రోల్ పోషించారు సిలాంబ‌ర‌స‌న్ , త్రిష కృష్ణ‌న్, క‌మ‌ల్ హాస‌న్. సినిమా త్వ‌ర‌లోనే రిలీజ్ చేయ‌నున్నారు. మూవీ పోస్ట‌ర్స్, సాంగ్స్ , టీజ‌ర్ కు మంచి స్పంద‌న రావ‌డంతో సినిమా ప్ర‌మోష‌న్స్ మ‌రింత ముమ్మ‌రం చేశారు చిత్ర బృందం. ఈ సంద‌ర్బంగా ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు త్రిష కృష్ణ‌న్, శింబు.

ఆ మ‌ధ్య‌న న‌య‌న్ తో డేటింగ్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కానీ త‌ను ప్ర‌భుదేవాతో కొంత ద‌గ్గ‌ర‌గా ఉండే ప్ర‌య‌త్నం చేసినా చివ‌ర‌కు శివ‌న్ ను పెళ్లి చేసుకుంది న‌య‌న‌తార‌. ఇప్పుడు క‌వ‌ల పిల్ల‌లు పుట్టారు. ఇక సిలాంబ‌ర‌స‌న్ త‌న వివాహం ఎప్పుడు అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. త్వ‌ర‌లోనే ఆ తీపి క‌బురు అంద‌రికీ చెబుతానంటూ తెలిపాడు. దీంతో ఎవ‌రై ఉంటార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. శింబు ఎవ‌రిని పెళ్లి చేసుకుంటాడ‌నేది ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ ప్ర‌శ్న‌గా మారింది.

Also Read : Pooja Hegde Shocking :ఆ డైరెక్ట‌ర్ మేక‌ప్ లేకుండా ర‌మ్మ‌న్నాడు

marriageSilambarasanSimbuUpdatesViral
Comments (0)
Add Comment