Singer Geetha Madhuri: వేడుకగా గాయని గీతామాధురి సీమంతం !

వేడుకగా గాయని గీతామాధురి సీమంతం !

Singer Geetha Madhuri: ప్రముఖ గాయని గీతామాధురి రెండో కాన్పుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. నటుడు నందును పెళ్ళి చేసుకుని దాక్షాయణి ప్రకృతికి అనే ఆడబిడ్డకు జన్మనిచ్చిన గీతామాధురి… రెండో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో గీతామాధురి సీమంతం వేడుకలు… తన ఇంట్లో గ్రాండ్ గా నిర్వహించారు. నటుడు నందు… తన భార్య గీతామాధురి సీమంతం వేడుకలను తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా నిర్వహించారు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుక ఫొటోలను గీతామాధురి తాజాగా ఆమె ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. దీనితో గీతామాధురి సీమంతం వేడుకల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు గీతా మాధురి, నందు దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Singer Geetha Madhuri Function

నేను పక్కా లోకల్ పక్కా లోకల్ వంటి సూపర్ హిట్ పాటలు పాడిన గీతా మాధురి(Singer Geetha Madhuri)… తెలుగులో మంచి గుర్తింపు పొందింది. ఎన్నో సినిమాల్లో ఆమె సూపర్‌హిట్‌ పాటలు పాడారు. కెరీర్‌ లో రాణిస్తోన్న తరుణంలోనే నటుడు నందుతో 2014లో ఏడడుగులు వేశారు. వీరికి దాక్షాయణి ప్రకృతి అనే కుమార్తె కూడా ఉంది. త్వరలో ఆమె రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారు. ‘‘ఫిబ్రవరి 2024లో మా దాక్షాయణి ప్రకృతి అక్క కానుంది’’ అంటూ గతేడాది డిసెంబర్‌లో ఆమె పోస్ట్‌ పెట్టారు. డెలివరీకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలిఉండటంతో గీతామాధురి సీమంతాన్ని కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు.

Also Read : Upasana Konidela: పద్మవిభూషణ్ మెగాస్టార్ కు ఉపాసన స్పెషల్ ట్రీట్ ! హాజరైన తెలంగాణ సీఎం !

Geetha MadhuriPakka Local
Comments (0)
Add Comment