Singer Pravasthi Sensational Comment :కీర‌వాణి..చంద్ర‌బోస్..సునీత వేధించారు

సింగ‌ర్ ప్ర‌వ‌స్తి ఆరాధ్య సంచ‌ల‌న కామెంట్స్

Singer Pravasthi : పాడుతా తీయ‌గా రియాల్టీ షోలో పార్టిసిపేట్ చేసిన ప్ర‌ముఖ గాయ‌ని ప్ర‌వ‌స్తి ఆరాధ్య సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. న్యాయ నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రించిన సంగీత ద‌ర్శ‌కుడు ఎంఎం కీర‌వాణి(MM Keeravani), గేయ ర‌చ‌యిత చంద్ర‌బోస్, సింగ‌ర్ సునీత ఉప‌ద్ర‌ష్ట త‌న‌ను కావాల‌ని హ్యూమిలేట్ చేసే ప్ర‌య‌త్నం చేశారంటూ వాపోయింది. దివంగ‌త దిగ్గ‌జ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం 1996లో పాడుతా తీయ‌గా అనే కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. దీనిని ఈటీవీ ప్రారంభించింది ప్ర‌తిష్టాత్మ‌కంగా. ఈ ప్రోగ్రామ్ కు ప్ర‌పంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు.

Singer Pravasthi Sensational Comments on Keeravani, Chandrabose, Sunitha

ఈ రియాల్టీ షో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందింది. గ‌తంలో పార్టిసిపెంట్స్ కు మంచి గుర్తింపు, ఆద‌ర‌ణ‌, మ‌ద్ద‌తు ఉండేద‌న్నారు సింగ‌ర్ ప్ర‌వ‌స్తి ఆరాధ్య‌. కానీ ఇప్పుడు ఆ సీన్ లేద‌ని వాపోయింది. లెజెండ‌రీ గాయ‌కుడు ఎస్పీబీ ఎంతో ఆద‌రించార‌ని, ఆయ‌న త‌న‌కు ఎల్ల‌కాలం ఇన్సిపిరేష‌న్ గా నిలుస్తూ వ‌చ్చార‌ని చెప్పింది. ఇక కీర‌వాణి, చంద్ర‌బోస్, సునీత చాలా దారుణంగా త‌న ప‌ట్ల అవ‌మాన‌క‌రంగా ప్ర‌వ‌ర్తించారంటూ క‌న్నీటి ప‌ర్యంత‌మైంది. తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వీడియోను షేర్ చేసింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఇదిలా ఉండ‌గా దిగ్గ‌జ గాయ‌కుడు లేక పోయినా పాడుతా తీయ‌గా ప్రోగ్రామ్ ను ముందుకు తీసుకు వెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు త‌న‌యుడు, గాయ‌కుడు ఎస్పీ చ‌ర‌ణ్. ఇటీవ‌లే ఈ షో సిల్వ‌ర్ జూబ్లీ సీరీస్ ను పూర్తి చేసుకుంది. కాగా ఈ షో నుంచి ప్ర‌వ‌స్తి ఆరాధ్య ఎలిమినేట్ అయ్యింది. మంచి సింగ‌ర్ గా గుర్తింపు పొందింది. త‌ను త్వ‌ర‌గా ఈ కార్య‌క్ర‌మం నుంచి త‌ప్పుకోవ‌డం ప్ర‌తి ఒక్క‌రినీ విస్తు పోయేలా చేసింది. పాడుతా తీయ‌గా ప్రోగ్రామ్ కు వెళ్లాల‌ని అనుకునే వాళ్లు ఎవ‌రైనా రెఫ‌ర్ చేస్తే కానీ లేదా రిక‌మండేష‌న్స్ తో వెళ్లాల‌ని సూచించింది.

Also Read : Hero Dhanush-Kubera Song :జాకే ఆనా యారా సాంగ్ సూప‌ర్

CommentsShockingViral
Comments (0)
Add Comment