Popular Singer S Janaki Birthday : కోయిల‌మ్మ‌ క‌ల‌కాలం వ‌ర్ధిల్ల‌వ‌మ్మ‌

ఏప్రిల్ 23 గాన కోకిల పుట్టిన రోజు

S Janaki : వేల పాట‌లు పాడి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను క‌లిగిన ఏకైక సినీ గాయ‌ని ఎస్. జాన‌కి పుట్టిన రోజు ఇవ్వాళ‌. త‌ను ఏప్రిల్ 23, 1938లో పుట్టారు. జాన‌కి వ‌య‌సు 87 ఏళ్లు. త‌న పూర్తి పేరు శ్లిష్ట శ్రీ‌రామ మూర్తి జాన‌కి. ఇత‌ర పేర్లు జాన‌క‌మ్మ‌, గాన కోకిల అని కూడా పిలుస్తారు. క‌ర్ణాట‌క సంగీతం ఆధారంగా త‌ను పాట‌లు పాడుతూ వ‌చ్చారు. పేరు పొందిన సంగీత ద‌ర్శ‌కుల వ‌ద్ద పాట‌లు పాడారు. ఎక్కువ‌గా దివంగ‌త పండితారాధ్యుల బాల సుబ్ర‌మ‌ణ్యంతో క‌లిసి పాట‌లు పాడారు. ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ క‌ల‌కాలం గుర్తుండి పోయేలా పాడిన పాట‌లు ఉన్నాయి. అవి ఎల్ల‌ప్ప‌టికీ మ‌న‌సుల‌ను వెంటాడుతూనే ఉంటాయి.

Popular Singer S Janaki Birthday Today

త‌ను 1957లో సినీ రంగంలోకి ప్ర‌వేశించింది. 2017 దాకా సంగీత ప‌రంపర కొన‌సాగుతూ వ‌చ్చింది. త‌న భ‌ర్త వి. రామ ప్ర‌సాద్. ఆయ‌న 1997లో మృతి చెందారు. కొడుకు ముర‌ళీకృష్ణ‌. మేన‌ల్లుడు ప్ర‌ముఖ గాయ‌కుడు గ‌రిమెళ్ల బాల‌కృష్ణ ప్ర‌సాద్. ఆయ‌న టీటీడీలో ఆస్థాన గాయ‌కుడిగా ఉన్నారు. ఇటీవ‌లే లోకాన్ని వీడారు. ఎస్. జాన‌కి(S Janaki) 60 ఏళ్ల‌కు పైగా సినీ రంగంలో ఉన్నారు. పాట‌లు పాడుతూ వ‌చ్చారు. కెరీర్ ప‌రంగా తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల‌లో 50, 000 వేల పాట‌లు పాడారు. వీటిలో ఎక్కువ‌గా క‌న్న‌డ‌, మ‌ల‌యాళంలో ఉన్న‌వే కావ‌డం విశేషం.

ఎస్. జాన‌క‌మ్మ(S janaki) ఉత్త‌మ నేప‌థ్య గాయ‌నిగా జాతీయ స్థాయిలో నాలుగుసార్లు పుర‌స్కారం అందుకున్నారు. అంతే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి 31 సార్లు అవార్డులు పొందారు . ఎంతో మంది సంగీత ద‌ర్శ‌కులున్నా..ఎక్కువ పాట‌లు త‌ను మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీత ద‌ర్శ‌క‌త్వంలో, ఎస్పీబీతో క‌లిసి పాడారు . మైసూర్ యూనివ‌ర్శిటీ నుంచి గౌర‌వ డాక్ట‌రేట్ అందుకున్నారు. త‌మిళ‌నాడు స‌ర్కార్ క‌ళైమామ‌ణి అత్యున్న‌త పుర‌స్కారం ల‌భించింది. ద‌క్షిణ భార‌త క‌ళాకారుల‌కు స‌రైన గుర్తింపు ఇవ్వ‌డం లేదంటూ 2013లో భార‌త ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప‌ద్మ భూష‌ణ్ పుర‌స్కారాన్ని తిర‌స్క‌రించారు. 1957లో విధియిన్ విల‌యాట్టు అనే త‌మిళ సినిమాతో కెరీర్ ప్రారంభించాచ‌రు. 2016లో తాను పాడ‌టం ఆపేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త‌ను క‌ల‌కాలం పాడుతూ ఉండాల‌ని కోరుకుందాం.

Also Read : Lokesh Kanagaraj Sensational :లోకేష్ సంచ‌ల‌నం సోష‌ల్ మీడియాకు దూరం

BirthdayJanakiUpdatesViral
Comments (0)
Add Comment