సింగిల్ చిత్రం వ‌సూళ్ల‌లో సంచ‌ల‌నం

రూ. 25 కోట్ల‌తో దూసుకు పోతున్న మూవీ

శ్రీ‌విష్ణు , వెన్నెల కిషోర్ కీ రోల్స్ పోషించిన చిత్రం సింగిల్. ఇది ప్రేక్ష‌కుల ముందుకు కూల్ గా వ‌చ్చింది. అనుకోని రీతిలో బిగ్ స‌క్సెస్ టాక్ తెచ్చుకుంది. ఏకంగా రూ. 25 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఇంకా క‌లెక్ష‌న్స్ భారీగా సాధించేందుకు రెడీ అవుతోంది. ఆరోగ్య‌క‌ర‌మైన కామెడీ, స‌స్పెన్స్ తో ద‌ర్శ‌కుడు సినిమాను తెర‌కెక్కించాడు. త‌ను చేసిన ప్ర‌య‌త్నం మంచి ఫ‌లితాన్ని ఇచ్చేలా చేసింది. ఊహించ‌ని రీతిలో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది.

ఇదిలా ఉండ‌గా ఈ ఏడాది విడుద‌లైన భారీ చిత్రాల‌తో చిన్న సినిమాలు పోటీ ప‌డ్డాయి. వాటిలో మారి ముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన డ్రాగ‌న్ త‌మిళ్, తెలుగులో విడుద‌లైంది. ఏకంగా రూ. 130 కోట్లు సాధించింది. నేచుర‌ల్ స్టార్ నాని నిర్మాణ సార‌థ్యంలో వ‌చ్చిన కోర్టు బిగ్ స‌క్సెస్ అయ్యింది. ఇది రూ. 50 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ కొల్ల‌గొట్టింది. మంచి క‌థ ఉంటే త‌ప్ప‌కుండా సినిమాలు ఆడుతాయ‌ని తేలి పోయింది.

తాజాగా ప్రేక్ష‌కుల‌కు ముందుకు వ‌చ్చిన సింగిల్ సైతం అంద‌రినీ ఆశ్చ‌ర్య పోయేలా చేసింది. వ‌సూళ్ల వేట కొన‌సాగిస్తోంది. ఇందులో న‌టించిన కేతికా శ‌ర్మ‌కు ఎట్ట‌కేల‌కు సినిమా బ్రేక్ ఇచ్చింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. త‌ను గ‌తంలో ప‌లు సినిమాల‌లో న‌టించినా అవి వ‌ర్క‌వుట్ కాలేదు. నితిన్ , శ్రీ‌లీల న‌టించిన రాబిన్ హుడ్ లో స్పెష‌ల్ సాంగ్ అదిదా వివాదాస్ప‌ద‌మైంది. ఆమెకు పేరు తీసుకు వ‌చ్చేలా చేసింది. మొత్తంగా సింగిల్ సూప‌ర్ టాక్ తెచ్చుకోవ‌డంతో మూవీ మేక‌ర్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Comments (0)
Add Comment