Single : శ్రీ విష్ణు , వెన్నెల కిషోర్ నటించిన చిత్రం సింగిల్. ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆశించిన దానికంటే ఆదరణ లభిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చూసిన ప్రతి ఒక్కరు బాగుందంటూ పేర్కొంటుండడంతో మూవీ మేకర్స్ ఫుల్ సంతోషంగా ఉన్నారు. ప్రధానంగా కమెడియన్ , హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు వెన్నెల కిషోర్. తనకు వంద మార్కులు పడ్డాయి. సింగిల్ నవ్వులు పూయిస్తోంది. గుండెలకు హాయిని చేకూర్చేలా చేస్తోంది. ఇక మరో హీరో శ్రీ విష్ణు కామెడీకి పేరు పొందాడు. కేవలం ఎంటర్ టైనర్ జానర్ లో ఉండే కథలకు ప్రయారిటీ ఇస్తూ వచ్చాడు.
Single Movie Success Talk
తను కార్తీక్ రాజాతో కలిసి పని చేశాడు శ్రీ విష్ణు(Sree Vishnu). ఇవానా, కేతిక శర్మ ఇందులో హీరోయిన్లుగా నటించారు. ఆశాజనకమైన ట్రరైలర్, ప్రమోషన్స్ ఈ సినిమాకు అదనపు బలం చేకూర్చాయి. సింగిల్ అనేది తన ఒంటరి జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్న విజయ్ పాత్ర పోషించిన శ్రీ విష్ణు కథ. పూర్వ పాత్ర పోషించిన కేతిక శర్మతో ప్రేమ ప్రయాణాన్ని అనుసరిస్తుంది. రిలాక్స్ , స్టైల్ తో , సహజ సిద్దమైన కామెడీని పండించేలా చేశాడు దర్శకుడు.
కేతిక శర్మ పాత్రకు అంతగా ప్రయారిటీ ఇవ్వలేదని చెప్పక తప్పదు. ఇవానా ఆకర్షణీయమైన పాత్రలో ఒదిగి పోయింది. ప్రత్యేకించి చెప్పాల్సింది స్పెషల్ హీరో వెన్నెల కిషోర్ గురించి. తను సూపర్ గా నటించాడు. కామెడీ పండించాడు. వీరితో పాటు వీటీవీ గణేష్, రాజేంద్ర ప్రసాద్ , సత్య, సరైన్ నితిన్ కూడా తమకు ఇచ్చిన పాత్రల్లో ఒదిగి పోయారు. నవ్వులు పూయించేందుకు ప్రయత్నం చేశారు. మొత్తంగా సింగిల్ మూవీకి సానుకూల దృక్పథంతో ముందుకు సాగడం, సక్సెస్ కావడం పక్కా అని చెప్పక తప్పదు.
Also Read : Nagavamshi Shocking Comments :రౌడీని తప్పుగా అర్థం చేసుకున్నారు