గతంలో విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందిన సితారే జమీన్ పర్ మూవీ మరోసారి అలరించేందుకు వచ్చింది. ఈనెల 20న రిలీజ్ అయ్యింది. భారీ ఎత్తున ప్రచారం చేపట్టారు. ఒకింత మేర కలెక్షన్స్ వచ్చేందుకు ఆస్కారం ఏర్పడింది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్ అమీర్ ఖాన్ , జెనీలియా దేశ్ ముఖ్ కీలక పాత్రలు పోషించారు. ఒకటవ రోజు 9,500కి పైగా షోలు ప్రదర్శితం అయ్యాయి. రూ. 11.5 కోట్లు మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి. ముఖ్యంగా ఈ చిత్రానికి థియేటర్లలో పోటీ తక్కువగా ఉండటంతో ఇది అంచనాలకు కొంచెం తక్కువ.
ఈ చిత్రానికి మిశ్రమ సమీక్షలు వచ్చాయి. ప్రారంభ రోజు సంఖ్యలు అమీర్ ఆశలకు సరిపోలలేదు. ముందస్తు బుకింగ్ అంచనాలు రూ. 10 కోట్ల కంటే తక్కువగా అంచనా వేయబడినప్పటికీ, ఈ చిత్రం దాని కంటే మెరుగ్గా రాణించింది. బహుశా 18 సంవత్సరాల క్రితం విడుదలైన తారే జమీన్ పర్ అంతగా ఆకట్టుకుంటుందా అన్నది ఇంకా తేలాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
ఈ చిత్రం సగటు థియేటర్ ఆక్యుపెన్సీ 21.34 శాతం. ఉదయం, మధ్యాహ్నం షోలు దాదాపు 16 శాతం ఆక్యుపెన్సీని కలిగి ఉండగా, సాయంత్రం, రాత్రి షోలు 20.21 శాతం, 32.5 కి కొద్దిగా మెరుగుపడ్డాయి. టిక్కెట్ల అమ్మకాల డేటా ఆధారంగా ప్రతి షోలో సగటున 12 మంది మాత్రమే హాజరయ్యారు.
ఆమిర్ ఖాన్ గతంలో నటించిన లాల్ సింగ్ చద్దా 2022లో విడుదలైంది. ఇదే సంఖ్యలో షోస్ ప్రదర్శించింది. మొదటి రోజు రూ. 11.7 కోట్లు సంపాదించింది, దాదాపు రూ. 61 కోట్లతో ముగిసింది. దీనికి విరుద్ధంగా, తారే జమీన్ పర్ చిత్రం రూ. 2 కోట్ల ప్రారంభోత్సవాన్ని సాధించింది. కానీ థియేటర్లలో ప్రసారం అయిన సమయంలో రూ. 63 కోట్లు వసూలు చేసింది.
సీతారే జమీన్ పర్ చిత్రం లాల్ సింగ్ చద్దా కంటే తక్కువ బడ్జెట్తో నిర్మించబడింది . ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జెనీలియా దేశ్ముఖ్తో పాటు అరూష్ దత్తా, గోపీ కృష్ణన్ వర్మ, వేదాంత్ శర్మ , తదితరులు నటించారు. కథను సిద్ది శర్మ రాస్తే, అమీర్ ఖాన్, అపర్ణ పురోహిత్ సంయుక్తంగా నిర్మించారు.