Hero Sivakarthikeyan-Trivikram :శివ కార్తికేయ‌న్ డిమాండ్ త్రివిక్ర‌మ్ షాక్

అందుకే త‌న‌తో సినిమా కు నో ఛాన్స్ 

Sivakarthikeyan : టాలీవుడ్ లో మోస్ట్ డిమాండ్ ఉన్న ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్. త‌ను మాట‌ల మాంత్రికుడిగా గుర్తింపు పొందాడు. టేకింగ్, మేకింగ్ లో త‌న‌కు త‌నే సాటి. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాలు తీశాడు. త‌న ద‌ర్శ‌క‌త్వంలో జూనియ‌ర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మ‌హేష్ బాబు, నితిన్ రెడ్డి న‌టించారు. గ‌త ఏడాది త‌ను ప్రిన్స్ తో మూడో సినిమా తీశాడు . అది గుంటూరు కారం. అంత‌కు ముందు త్రివిక్ర‌మ్ మ‌హేష్ తో అత‌డు, ఖ‌లేజా తీశాడు. ఈ రెండూ సూప‌ర్ హిట్ గా నిలిచాయి. బ‌న్నీతో త‌న బంధం కంటిన్యూ కావాల‌ని కోరుకున్నాడు.

Sivakarthikeyan-Trivikram Srinivas Movie

ఈ మేర‌కు ప‌లుమార్లు త‌న‌తో క‌థ‌ల గురించి చ‌ర్చ‌లు జ‌రిపారు. కానీ ఉన్న‌ట్టుండి బ‌న్నీ స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనిని ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీగా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. దీనిని స‌న్ పిక్చ‌ర్స్ ఏకంగా రూ. 800 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేయ‌నున్నారు. దీంతో అల్లు అర్జున్  తో సినిమా కుద‌ర‌క పోవ‌డంతో మ‌రో క‌థను శివ కార్తికేయ‌న్(Sivakarthikeyan) కు వినిపించాడు. త‌న‌కు న‌చ్చ‌డం, దానికి ఓకే చెప్ప‌డం కూడా జ‌రిగి పోయింది. అయితే చ‌ర్చ‌ల్లో భాగంగా హీరోగా న‌టించాలంటే త‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వాల‌ని కోరిన‌ట్టు స‌మాచారం.

శివ కార్తికేయ‌న్ పెద్ద మొత్తంలో డిమాండ్ చేయ‌డం ప‌ట్ల బిగ్ షాక్ కు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ గుర‌య్యాడు. దీంతో త‌న ప్ర‌య‌త్నం నుంచి విర‌మించు కోవ‌డ‌మే మేల‌ని భావించిన‌ట్లు స‌మాచారం. అంత లోపే విక్ట‌రీ వెంక‌టేశ్ కు క‌థ చెప్ప‌డం, త‌ను ఓకే అనడంతో న్యూ మూవీని స్టార్ట్ చేసేందుకు ప్ర‌య‌త్నం చేశాడు. అయితే శివ  కార్తికేయ‌న్ ఇప్పుడు త‌మిళంతో పాటు తెలుగులో త‌న‌కు మంచి ఆద‌ర‌ణ ఉంది. అమ‌ర‌న్ సినిమా ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో రెమ్యూన‌రేష‌న్ పెంచ‌డం ..దానికి నో చెప్ప‌డం జ‌రిగింది.

Also Read : Pooja Hegde Shocking Comment :ఇన్‌స్టా ఫాలోవర్లు థియేట‌ర్ల‌కు రారు

CinemaSivakarthikeyanTrivikram SrinivasUpdatesViral
Comments (0)
Add Comment