Sourav Ganguly Shocking Comment :హిట్ మ్యాన్ పై సౌర‌వ్ గంగూలీ కామెంట్స్

రోహిత్ శ‌ర్మ అద్భుత‌మైన ఆట‌గాడు

Sourav Ganguly : కోల్ క‌తా – బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్, ఢిల్లీ జ‌ట్టు హెడ్ కోచ్ సౌర‌వ్ గంగూలీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. భార‌త క్రికెట్ జ‌ట్టుకు విశిష్ట సేవ‌లు అందించిన రోహిత్ శ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు. త‌ను ఇంత త్వ‌ర‌గా క్రికెట్ నుంచి నిష్క్ర‌మిస్తాడ‌ని అనుకోలేద‌న్నాడు. ప్ర‌త్యేకించి ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఈ హిట్ మ్యాన్ ఉన్న‌ట్టుండి టెస్టు క్రికెట్ ఫార్మాట్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

Sourav Ganguly Shocking Comments

ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న వెంట‌నే మ‌రో స్టార్ క్రికెట‌ర్ , వ‌ర‌ల్డ్ టాప్ క్లాస్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ సైతం తాను కూడా టెస్టు క్రికెట్ నుంచి వైదొలుగుతున్న‌ట్లు తెలిపాడు. దీంతో కొన్నేళ్ల పాటు విశిష్ట సేవ‌లు అందించిన ఈ ఇద్ద‌రు దిగ్గ‌జ ఆట‌గాళ్లు దూరం కావ‌డం ప‌ట్ల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు సౌర‌వ్ గంగూలీ(Sourav Ganguly). ఈ నిర్ణ‌యం ఊహించ లేద‌న్నాడు. ఇద్ద‌రూ ఫుల్ ఫామ్ లో ఉన్నార‌ని, కానీ ఎందుక‌ని ఇంత త్వ‌ర‌గా డెసిష‌న్ తీసుకున్నారో త‌న‌కు అర్థం కాలేద‌ని చెప్పాడు.

మ‌రో వైపు బీసీసీఐకి చీఫ్ గా ఉన్న స‌మ‌యంలో విరాట్ కోహ్లీకి, గంగూలీకి మ‌ధ్య ప‌చ్చ గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా ఉండేది. చివ‌ర‌కు త‌న ప్రెష‌ర్స్ త‌ట్టుకోలేక ఒకానొక స‌మ‌యంలో షాకింగ్ కామెంట్స్ చేశాడు దాదాపై. అప్ప‌ట్లో దేశ వ్యాప్తంగా ఇద్ద‌రి వ్య‌వ‌హారం సంచ‌ల‌నం క‌లిగించింది. ఆ త‌ర్వాత త‌ను త‌ప్పుకోవ‌డం, కోహ్లీ ఆడుతూ ఉండ‌డం జ‌రిగింది. మొత్తంగా రోహిత్ శ‌ర్మ అద్భుత‌మైన ఆట‌గాడంటూ గంగూలీ ప్ర‌శంస‌లు కురిపించ‌డం విశేషం.

Also Read : Rajat Patidar Shocking :పాటిదార్ కు గాయం మ్యాచ్ కు దూరం

CommentsIPL 2025Sourav GangulyUpdatesViral
Comments (0)
Add Comment