IPL 2025-SA Players Shocking :ప్లే ఆఫ్స్ కు సౌతాఫ్రికా ఆట‌గాళ్లు దూరం

స్ప‌ష్టం చేసిన ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు

IPL 2025 : ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. త‌మ దేశానికి చెందిన ఆట‌గాళ్లు ఎవ‌రూ ఐపీఎల్ లో ఆడ‌టానికి వీలు లేద‌ని పేర్కొంది. ఇప్ప‌టికే ఒప్పందం మేర‌కు తిరిగి స్వ‌దేశానికి రావాల‌ని కోరింది. ఎందుకంటే ఐసీసీ రూల్స్ ప్ర‌కారం ప్ర‌స్తుతం జూన్ 11న వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ ఆడాల్సి ఉంది. ఈ కీల‌క పోరు ఇంగ్లండ్ లోని ప్ర‌ముఖ స్టేడియం లార్డ్స్ వేదిక కానుంది.

IPL 2025 – South Africa Players Shocking

ఇదిలా ఉండ‌గా ఐపీఎల్(IPL 2025) నిర్దేశించిన షెడ్యూల్ ప్ర‌కార‌మే జ‌ర‌గాల్సి ఉండ‌గా అనివార్య కార‌ణాల వ‌ల్ల‌, భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకోవ‌డంతో కొన్ని రోజులు వాయిదా వేయాల్సి వ‌చ్చింది. ఈ విష‌యాన్ని అన్ని క్రికెట్ బోర్డుల‌కు, ఆట‌గాళ్ల‌కు తెలియ చేసింది భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు.

అయితే ఐపీఎల్ లో ఆడేందుకు విదేశీ ఆటగాళ్ల‌తో బీసీసీఐ అధికారికంగా మే 26 వ‌ర‌కు మాత్ర‌మే ఒప్పందం చేసుకుంది. దీంతో ఐపీఎల్ కీల‌క మిగిలి పోయిన మ్యాచ్ ల‌కు విదేశీ ఆట‌గాళ్లు దూరం కానున్నారు. వారిలో వెస్టిండీస్ , ఆఫ్గ‌నిస్తాన్ , ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీ‌లంక‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల‌కు చెందిన ప్లేయ‌ర్లు అత్య‌ధికంగా ఉన్నారు.

తాజాగా ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (డ‌బ్ల్యూటీసీ ) ఫైన‌ల్ మ్యాచ్ ఆస్ట్రేలియా జ‌ట్టుతో సౌతాఫ్రికా టీమ్ త‌ల‌ప‌డ‌నుంది. అందుకే వెంట‌నే రావాల్సిందిగా కోరింది. వీరిని రిలీజ్ చేయాల‌ని బీసీసీని కోరింది. ఇదే విష‌యాన్ని ఐసీసీకి వెల్ల‌డించింది.

Also Read : Beauty Lavanya Tripathi :లావ‌ణ్య త్రిపాఠి స‌తీ లీలావ‌తి

CricketIPL 2025South AfricaUpdatesViral
Comments (0)
Add Comment