Vijay Devarakonda : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సినిమా నుంచి తప్పుకున్న శ్రీలీల

సితార ఎంటర్ టైనమెంట్స్ నిర్మాణం ఈ సినిమా నుండి ఇప్పుడు శ్రీలీల తప్పుకున్నట్టుగా సమాచారం...

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘జెర్సీ’ ఫేమ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతోంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు సత్యదేవ్ ఒక పాత్రలో కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమా అధికారికంగా లాంచ్ చేసినప్పుడు ఈ సినిమాలో శ్రీలీల కథానాయకురాలుగా కనిపించింది, ఆమె ఆ ముహూర్తం ఈవెంట్ కి హాజరైంది కూడా.

Vijay Devarakonda Movies

సితార ఎంటర్ టైనమెంట్స్ నిర్మాణం ఈ సినిమా నుండి ఇప్పుడు శ్రీలీల తప్పుకున్నట్టుగా సమాచారం. ఆమెకి బదులుగా భాగ్యశ్రీ బోర్సే ని కథానాయకురాలిగా తీసుకున్నట్టు సమాచారం. అలాగే ఈ సినిమాలో ఇంకొక కథానాయకురాలు కూడా ఉందని, ఆమెని కూడా త్వరలోనే ఎంఐపిక చేస్తారని తెలుస్తోంది. భాగ్యశ్రీ బోర్సే హిందీ సినిమా ‘యారియన్ 2’ తో చిత్రపరిశ్రమలోకి అరంగేట్రం చేసింది. తెలుగులో దర్శకుడు హరీష్ శంకర్, రవి తేజతో చేస్తున్న ‘మిష్టర్ బచ్చన్’ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమా చిత్రీకరణ అయిపోయినట్టుగా సమాచారం, ఇప్పుడు విడుదలకి సిద్ధంగా వుంది. ఈ సినిమా విడుదలవకుండానే ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాలో ఆమెకు ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా కథ సముద్రం నేపధ్యంలో ఉంటుంది అని, అందుకనే ఎక్కువ భాగం విశాఖపట్నంలో ఉంటుంది, ఇంకా శ్రీలంకలో చిత్రీకరణ జరుపుకుంటుందని సమాచారం.

Also Read : Prasanth Varma : రణవీర్ సింగ్ తో ఇప్పట్లో సినిమా ఛాన్స్ లేదంటున్న ప్రశాంత్ వర్మ

MoviesTrendingUpdatesvijay devarakondaViral
Comments (0)
Add Comment