Single : కామెడీ, ఎంటర్ టైనర్ జానర్ లో వచ్చే సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు దర్శక, నిర్మాతలు. ఈ ఏడాది చిన్న బడ్జెట్ తో వచ్చిన మూవీస్ ఊహించని రీతిలో బిగ్ సక్సెస్ అయ్యాయి. కాసుల వర్షం కురిపించాయి. వాటిలో మారి ముత్తు తీసిన డ్రాగన్ . ఇది తమిళంలో, ఇటు తెలుగులో దంచి కొట్టింది. కోట్లు వచ్చేలా చేసింది. ఇందులో నటించిన ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా వైరల్ గా మారాడు. అంతే కాదు అనుపమ రంగనాథన్, కయాదు లోహర్ కీ రోల్స్ పోషించారు.
Single Movie Sensational Collections
కానీ అనుపమ కంటే కయాదు లోహర్ నేషనల్ క్రష్ గా మారింది. ఆ తర్వాత వచ్చిన మరో మూవీ నాని నిర్మించిన చిత్రం కోర్టు. ఇది కూడా భారీగా వసూళ్లు చేసింది. దర్శక, నిర్మాతలకు మంచి ఫీల్ గుడ్ ను అందించింది. ఇదే సమయంలో వచ్చిన మరో మూవీ శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ నటించిన చిత్రం సింగిల్(Single). ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా దీనిని ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. కేవలం 2 రోజుల్లోనే సింగిల్ ఏకంగా రూ. 11.20 కోట్ల వసూలు చేసింది. యుఎస్ ఏలో అయితే భారీగా ఆదరిస్తున్నారు. తొతి రోజు రూ. 4.15 కోట్లు వసూలు చేయగా రెండో రోజు రూ. 7.05 కోట్లు వసూలు చేసింది. గణనీయమైన వసూళ్లు సాధిస్తుండడంతో సింగిల్ గట్టెక్కేలా ఉంది.
ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించాడు. ఆశ్చర్య పోయేలా ప్రేక్షకులు ఆదరించడం విశేషం. క్లీన్ హాస్యం, మనోహరమైన ప్రదర్శనలు, కుటుంబ, స్నేమ పూర్వకమైన కథల ఎంపిక సింగిల్ సినిమా సక్సెస్ అయ్యేందుకు దోహద పడింది. వారాంతంలో అమెరికాలో అర మిలియన్ డాలర్లను వసూలు చేసినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ లు పోటీపడి నటించారు. అద్భుతంగా మరోసారి హాస్యాన్ని పండించేలా చేశారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 80,000 లకు పైగా టికెట్లు అమ్ముడు పోయాయి.
Also Read : Beauty Samantha :ఆ సాంగ్ అంత హిట్ అవుతుందని అనుకోలేదు