Srikanth Kandragula Shocking :ప్లీజ్ సూత్రవాక్యానికి మ‌ద్ద‌తు ఇవ్వండి

నిర్మాత శ్రీ‌కాంత్ కాండ్ర‌గుల పిలుపు

Srikanth Kandragula : సినీ నిర్మాత శ్రీ‌కాంత కాండ్ర‌గుల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. షైన్ టామ్ చాకో, విన్సీ అలోషియస్ వివాదంపై స్పందించారు. తాను నిర్మించిన సూత్ర‌వాక్యం సినిమాకు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు. వ్య‌క్తిగ‌త తారాగ‌ణం చుట్టూ ఉన్న వివాదం కంటే సినిమాపై ఫోక‌స్ పెట్టాల‌ని సూచించారు. న‌టుడు షైన్ టామ్ చాకోపై న‌టి విన్సీ అలోషియస్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. త‌ను త‌న ప‌ట్ల అనుచితంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని, డ్ర‌గ్స్ తీసుకుని వ‌చ్చాడ‌ని వాపోయింది. చాలా అసౌక‌ర్యానికి గురైనట్లు తెలిపింది.

Srikanth Kandragula Comments

కాగా అనుమానిత మాదక ద్రవ్యాల వాడకంపై ఫిర్యాదు చేసిన తర్వాత సూత్ర‌వ్యాక్యం ఇటీవల పరిశీలనలోకి వచ్చింది. ఆమె అంతర్గత ఫిర్యాదుల కమిటీ , మ‌ల‌యాళ సినీ క‌ళాకారుల సంఘంకు ఫిర్యాదు చేసింది విన్సీ అలోషియ‌మ్. సూత్రవాక్యం చిత్రీకరణ సమయంలో ఈ సంఘటన జరిగినట్లు చెప్పినప్పటికీ, బృందం సృజనాత్మక ప్రయత్నాలను ఏ ఒక్క వ్యక్తి వ్యక్తిగత చర్యల ద్వారా కప్పి వేయకూడదని కాండ్రగుల(Srikanth Kandragula) స్ప‌ష్టం చేశారు.

సూత్రవాక్యం హృద‌యాల‌ను , ఆత్మ‌ల‌ను క‌లిపేలా చిత్రీక‌ర‌ణ చేయ‌డం జ‌రిగింద‌న్నారు నిర్మాత‌. ప్రేక్ష‌కుల‌తో నేరుగా క‌నెక్ట్ అయ్యేందుకు ఇది దోహ‌ద ప‌డుతుంద‌న్నారు. ముఖ్యాంశాల‌ను సినిమా నుండి దృష్టి మ‌రల్చేందుకు ప్ర‌య‌త్నం చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు శ్రీ‌కాంత్ కాండ‌గుల‌. ద‌యచేసి ప్రేక్ష‌కులు వీటిని ప‌ట్టించుకోకుండా స‌హ‌క‌రించాల‌ని కోరారు.

Also Read : Thalaiva Coolie Sensational :త‌లైవా కూలీ తెలుగు రైట్స్ రూ. 40 కోట్లు ..?

CommentsNew MoviesProducerViral
Comments (0)
Add Comment