Srinidhi Shetty Shocking : య‌శ్ తో అందుకే వ‌ద్ద‌నుకున్నా – శ్రీ‌నిధి శెట్టి

సాయి ప‌ల్ల‌వి అయితేనే త‌న‌కు క‌రెక్ట్

Srinidhi Shetty : చేసింది కొన్ని సినిమాలే అయిన‌ప్ప‌టికీ త‌న‌కంటూ ఓ స్టార్ ఇమేజ్ స్వంతం చేసుకుంది న‌టి శ్రీ‌నిధి శెట్టి. త‌ను కొత్త‌గా నేచుర‌ల్ స్టార్ నానితో హిట్ 3లో త‌ళుక్కున మెరిసింది. మూవీ ప్ర‌మోష‌న్స్ సంద‌ర్బంగా త‌న మ‌న‌సులోని భావాల‌ను పంచుకుంది. ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది ప్ర‌ముఖ శాండిల్ వుడ్ యాక్ట‌ర్, పాన్ ఇండియా హీరో య‌శ్ గురించి. త‌న‌తో న‌టించాక చాలా మూవీస్ లో న‌టించాలంటూ ఆఫ‌ర్లు వ‌చ్చాయ‌ని చెప్పింది. అయితే తాజాగా య‌శ్ కీ రోల్ పోషిస్తున్న హీందీ మూవీ రాయాయ‌ణ్ లో ఛాన్స్ వ‌చ్చింది.

Srinidhi Shetty Comments

కానీ య‌శ్(Yash) తో తాను న‌టించ‌లేనంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టాన‌ని పేర్కొంది. తామిద్ద‌రం పండించిన కెమిస్ట్రీకి జ‌నం పెద్ద ఎత్తున ఫిదా అయ్యార‌ని, ఆ కాంబో అలాగే ఉండాల‌ని తాను కోరుకుంటూ వున్నాన‌ని , దీంతో ఈ మూవీలో త‌న‌కు డిఫ‌రెంట్ కేరెక్ట‌ర్ ప్ర‌పోజ్ చేశార‌ని, త‌న మ‌న‌సు ఒప్పుకోలేద‌ని చెప్పింది శ్రీ‌నిధి శెట్టి(Srinidhi Shetty) . రామాయ‌ణ్ లో య‌శ్ రావ‌ణాసురుడి పాత్ర పోషిస్తున్నాడ‌ని, ఇందులో సీత పాత్ర కోసం త‌న‌ను సంప్ర‌దించార‌ని తెలిపింది. కానీ తాను స‌రిపోనంటూ త‌ప్పుకున్నాన‌ని, నో చెప్పేశాన‌ని తెలిపింది.

ఇదిలా ఉండ‌గా రాక్ స్టార్ య‌శ్ , ల‌వ్లీ బ్యూటీ శ్రీ‌నిధి శెట్టి క‌లిసి ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో కేజీఎఫ్ మూవీలో న‌టించారు. ఇద దేశ వ్యాప్తంగా సూప‌ర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. కోట్ల‌ను వ‌సూలు చేసింది. స్టార్ హీరో ఇమేజ్ ను స్వంతం చేసుకునేలా చేసింది య‌శ్ కు. ఇదే స‌మ‌యంలో శ్రీ‌నిధి శెట్టికి కూడా మంచి పేరు తీసుకు వ‌చ్చింది. య‌శ్ తో తాను సీత పాత్ర‌ను చేయ‌డం ఏమిటంటూ పేర్కొంది. అయితే నేచుర‌ల్ న‌టి సాయి ప‌ల్ల‌వి అయితేనే ఆ పాత్ర‌కు స‌రి పోతుంద‌ని స్ప‌ష్టం చేసింది శ్రీ‌నిధి శెట్టి.

Also Read : Sarangapani Jathakam Sensational : న‌వ్వుల లోకం సారంగ‌పాణి జాత‌కం

CommentsSrinidhi ShettyViralyash
Comments (0)
Add Comment