SS Rajamouli: మహేశ్ బాబుతో సినిమా గురించి బిగ్ అప్ డేట్ ఇచ్చిన రాజమౌళి !

మహేశ్ బాబుతో సినిమా గురించి బిగ్ అప్ డేట్ ఇచ్చిన రాజమౌళి !

SS Rajamouli: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో త్వరలో సినిమా ప్రారంభం కాబోతుంది. ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ వర్కింగ్ టైటిల్ తో ప్రారంభం కాబోయే ఈ సినిమాను సుమారు రూ. 1000 కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇటీవల చెప్పిన మాటల ప్రకారం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరిగే అడ్వంచరెస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తుంది.

ఈనేపథ్యంలోనే ఈ సినిమాలో యాక్షన్ స్వీక్వెన్స్, ఫిట్ నెస్ మరియు కొత్త లుక్ కోసం మహేశ్ బాబు ఇప్పటికే జర్మనీ వెళ్లి ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. మరోవైపు జపాన్ లో జరుగుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ స్క్రీనింగ్ కోసం రాజమౌళి అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా జపాన్ ప్రజలు రాజమౌళిపై ఎనలేని అభిమానాన్ని చూపించారు. దీనితో త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ గురించి దర్శకుడు రాజమౌళి ఆశక్తికరమైన విషయాలను వెల్లడించారు.

SS Rajamouli Comment

ప్రస్తుతం జపాన్ లో జరుగుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ స్క్రీనింగ్ వేదికగా దర్శకుడు రాజమౌళి(SS Rajamouli) మాట్లాడుతూ… ‘మహేశ్‌ బాబుతో చేయబోతున్న సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. హీరోని మాత్రమే లాక్‌ చేశాం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ లో హీరో మహేశ్‌ బాబు. చాలా గ్లామర్‌ గా ఉంటారు. మీలో చాలా మందికి ఆయన గురించి తెలిసే ఉంటుంది. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి జపాన్‌లో కూడా రిలీజ్‌ చేస్తాం. ఆ సమయంలో మహేశ్‌ బాబుని కూడా ఇక్కడికి తీసుకొస్తాను’’ అని రాజమౌళి అన్నారు. దీనితో రాజమౌళి మాటల్ని సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్ విపరీతంగా షేర్‌ చేస్తున్నారు.

Also Read : Vishal: మెగా ఫోన్ పట్టనున్న విశాల్‌ !

MM KiravaniSS RajamouliSuper Star Mahesh Babu
Comments (0)
Add Comment