Game Changer Movie : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్

తమన్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్న ఏ సినిమాకైనా ఆయనే ముందుండి అప్డేట్స్‌తో ఇస్తూ...

Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌. 2024 క్రిస్మస్ సందర్భంగా తెలుగు, తమిళ‌, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధ‌మ‌వుతోన్న ఈ సినిమాపై ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అంచ‌నాలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే మరోవైపు ఫ్యాన్స్ మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలోనే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసిన అప్డేట్ ఫ్యాన్స్‌ని అయోమయానికి గురి చేస్తోంది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటంటే..

Game Changer Movie Updates

తమన్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్న ఏ సినిమాకైనా ఆయనే ముందుండి అప్డేట్స్‌తో ఇస్తూ.. ఫ్యాన్స్‌ని సంబరపరుస్తారు. ఈ క్రమంలోనే ‘గేమ్ చేంజర్(Game Changer)’ కి సంబంధించిన ఓ అప్డేట్ ఆయన షేర్ చేశారు. దీంతో సంబరపడాల్సిన అభిమానులు కాస్త అయోమయానికి గురయ్యారు. తాజాగా తమన్ తన ‘X’ ఖాతా ద్వారా ” బాహుశా ఈ దసరాకి సినిమా టీజర్ రాకపోతే నిరాశపడకండి. సినిమా చివరిదశ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. సీజీ, విఎఫ్ఎక్స్, డబ్బింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫైనల్ ఎడిటింగ్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.

సినిమాలోని ప్రతి పాటకి లిరికల్ వీడియోలు సిద్దమవుతున్నాయి. ఇవి ప్రతి నెల విడుదల చేస్తాము. ఈ నెల 30న బద్దలయిపోయే సాంగ్‌తో మీ ముందుకి వస్తాము. డిసెంబర్ 20న లేదా క్రిస్‌మస్‌కి గేమ్ చేంజర్(Game Changer) థియేటర్లలో రానుంది” అంటూ ఆయన చేసిన ట్వీట్ ఫ్యాన్స్‌ని అయోమయానికి గురి చేసింది. ఇంతకీ దసరాకి టీజర్ వస్తుందా.. రాదా? రిలీజ్ డేట్ ఎప్పుడంటూ ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తమన్ మరో ట్వీట్‌తో దసరాకి కాకుంటే దీపావళికి బ్లాస్ట్ ఉండబోతుందని తెలిపారు. అంటే ఈ సినిమా టీజర్ దసరాకి లేకపోతే దీపావళికి పక్కా వస్తుందన్నమాట. ఇప్పటికే రిలీజైన ‘రా మచ్చా మచ్చా..’ సాంగ్ యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్‌కి దగ్గర్లో ఉంది.

Also Read : Nagarjuna : విచారణలో భాగంగా నాంపల్లి కోర్టుకు హాజరైన నటుడు నాగార్జున

Cinemagame changerTrendingUpdatesViral
Comments (0)
Add Comment