అనారోగ్యం అందుకే పెళ్లికి దూరం

స్ప‌స్టం చేసిన బాలీవుడ్ స్టార్ హీరో

కోట్లాది మంది అభిమానులు ఆశ్చ‌ర్య పోయేలా త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట పెట్టాడు బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్. త‌ను తీవ్ర‌మైన మానసిక‌, శారీర‌క రుగ్మ‌ల‌తో బాధ ప‌డుతున్నాన‌ని చెప్పాడు. అందుకే ఎవ‌రు ఎన్ని ర‌కాలుగా చెప్పినా తాను పెళ్లికి దూరంగా ఉంటున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌ముఖ షోలో చిట్ చాట్ సంద‌ర్బంగా అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చాడు స‌ల్మాన్ ఖాన్. ఈ సంద‌ర్బంగా తాను గత కొంత కాలం నుంచి బ్రెయిన్ అనూరిజం అనే వ్యాధితో బాధ‌ప‌డుతూ వ‌స్తున్నాన‌ని వాపోయాడు. అందుకే తాను పెళ్లి చేసుకోవ‌డం లేదంటూ తెలిపాడు.

ఇదిలా ఉండ‌గా త‌ను ది గ్రేట్ ఇండియ‌న్ క‌పిల్ షో కు సంబంధించి కొత్త సీజ‌న్ లో తొలి అతిథిగా హాజ‌ర‌య్యాడు. ఓ వైపు అనారోగ్యంతో ఉన్న‌ప్ప‌టికీ పూర్తిగా ఫిట్ నెస్ తో క‌నిపించాడు. అయితే ఇంత ఫిట్ గా ఉన్నారు మీరు స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్నారంటే న‌మ్మ‌బుద్ది కావ‌డం లేద‌న్నారు క‌పిల్ శ‌ర్మ‌. ఇదే స‌మ‌యంలో మీరు స్టార్ హీరోగా ఉన్నారు. ల‌క్ష‌లాది మంది ఫ్యాన్స్ ను క‌లిగి ఉన్నారు. లెక్క‌లేనంత డ‌బ్బులు ఉన్నాయి. లెక్కించ లేనంత ఆస్తులు ఉన్నాయి. ప్ర‌తి ఒక్క‌రు పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటార‌ని, మీరు ఎందుకు ఆ వైపు ఆలోచించ లేద‌ని ప్ర‌శ్నించాడు.

దీనిపై మొద‌టిసారిగా తాను మౌనం వీడాడు. నాకు ఇప్పుడు 59 ఏళ్లు. మీరు అనుకుంటున్న‌ట్లు నేను హ్యాపీగా అంత‌ర్గ‌తంగా లేను. బ‌య‌ట మీకు అలా క‌నిపిస్తున్నాన‌ని అన్నాడు స‌ల్మాన్ ఖాన్. పెళ్లి అనేది ఒక విధంగా బందీఖానా అనే అర్థం వ‌చ్చేట‌ట్టు చెప్పాడు. కొత్త‌దాన్ని స్వీక‌రించ‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని అని పేర్కొన్నాడు. తాను ప్ర‌స్తుతం ట్రైజెమినల్ న్యూరల్జియాతో బాధ ప‌డుతున్నా. నా మెద‌డులో అనూరిజం ఉంది. అయిన‌ప్ప‌టికీ నేను కెరీర్ పై ఫోక‌స్ పెడుతూ ముందుకు సాగుతున్నాన‌ని వాపోయాడు.

పక్కటెముకలు విరగడం, ట్రైజెమినల్ న్యూరల్జియా, బ్రెయిన్ అనూరిజం లాంటి వ్యాధులు త‌న‌కు ఉన్నాయ‌ని క‌న్నీటి ప‌ర్యంతం అయ్యాడు.

Comments (0)
Add Comment