ప్రముఖ నటి సమంత రుత్ ప్రభు స్వయంగా నిర్మించిన చిత్రం శుభం. కామెడీ, హారర్ గా తెరకెక్కించాడు దర్శకుడు సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల. ఇందులో హర్షిత్ మల్లి రెడ్డి, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, శ్రీయ కొంఠం, గవిరెడ్డి శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు. ఎలాంటి అసభ్యత, బూతు మాటలు లేకుండా తెరకెక్కించాడు. తను చేసిన ప్రయత్నం ఫలించింది. మంచి టాక్ తెచ్చుకుంది. గత నెల మేలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి ఆదరణ లభించడం, ఆశించిన దానికంటే డబ్బులు రావడంతో అందాల సుందరి నమంత రుత్ ప్రభు సంతోషం వ్యక్తం చేస్తోంది.
తాజాగా ఈ మూవీకి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. శుభం బిగ్ సక్సెస్ కావడం, ఈవెంట్స్ లో పాల్గొనడం, చిట్ చాట్ చేయడంలో బిజీగా మారి పోయింది సమంత రుత్ ప్రభు. తను ఓ వైపు సినిమాలు, మరో వైపు వెబ్ సీరీస్ , ఇంకో వైపు సినిమాల నిర్మాణంలో బిజీగా మారింది. ఈ తరుణంలో శుభం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందనే దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది లవ్లీ హీరోయిన్.
మే 9న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం హారర్, కామెడీ జానర్ లో మంచి సక్సెస్ కావడంతో ఇందులో నటించిన వారంతా ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ సందర్బంగా సమంత రుత్ ప్రభు కీలక ప్రకటన చేసింది. జూన్ 13న శుభం సినిమాను జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. దీంతో సినిమాను చూడని వాళ్లకు గుడ్ న్యూస్ అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి.