Suhas-Keerthy : సుహాస్, కీర్తి సురేష్ నటించిన సినిమా ఓటీటీలో…అప్పటి నుంచే.!

అదే సందర్భంలో, అమెజాన్ ప్రైమ్ వీడియో 'ఉప్పుకప్పురంబు' సినిమా సారాంశాన్ని కూడా వెల్లడించింది

Suhas-Keerthy : టాలీవుడ్ లో మరో క్రేజీ జోడీకి రంగం సిద్ధమైంది. స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మహానటి కీర్తి సురేష్, ప్రస్తుతం హీరోగా వెలుగొందుతున్న సుహాస్(Suhas) కాంబినేషన్ లో ఓ క్రేజీ సినిమా రూపొందుతోంది. ఆసక్తికరమైన ఈ చిత్రానికి టైటిల్ కూడా ఖరారు చేశారు. నిన్నుల్లా. నిన్నిలా సినిమా ఫేమ్ ఐవీ శశి ఈ చిత్రానికి ‘ఉప్పుకప్పురంబు’ అనే టైటిల్ ని నిర్ణయించారు. వసంత్ మురళీకృష్ణ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. రాధిక లావో నిర్మాతగా వ్యవహరించనున్నారు. ప్రముఖ OTT కంపెనీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మంగళవారం (మార్చి 19) జరిగిన ఓ కార్యక్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను ప్రకటించారు. ఈ సినిమా అమెజాన్ ఒరిజినల్ మూవీగా విడుదల కానుంది. సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా విడుదల తేదీని ప్రకటిస్తుంది.

Suhas-Keerthy Movie Update

అదే సందర్భంలో, అమెజాన్ ప్రైమ్ వీడియో ‘ఉప్పుకప్పురంబు’ సినిమా సారాంశాన్ని కూడా వెల్లడించింది. ఇది పూర్తి సెటైరికల్ కామెడీ అవుతుంది. “గ్రామాలలో, శ్మశానవాటికలో తగినంత స్థలం లేనప్పుడు ఊహించని ఇబ్బందులు తలెత్తుతాయి.” దీంతో గ్రామ ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. మరి గ్రామస్తుల సమస్యలు పరిష్కరించారా? మరి ఇందులో సుహాస్, కీర్తి పాత్ర ఏంటో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

Also Read : Allu Arjun : ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్ కు వచ్చిన బన్నీ..సెల్ఫీలకోసం ఎగబడ్డ ఫ్యాన్స్

Keerthy SureshMovieSuhasTrendingUpdatesViral
Comments (0)
Add Comment