Hero Suhas-Mandadi :మందాడి సుహాస్ ఫ‌స్ట్ లుక్ కెవ్వు కేక

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో తెర‌కెక్కుతోంది

Mandadi : టాలెంట్ క‌లిగి ఉండ‌డం, క‌థ‌ను న‌మ్ముకోవ‌డం, సినిమాలు తీయ‌డం అనేది ప‌రిపాటిగా మారింది. టెక్నాల‌జీ మారింది. దానికి త‌గ్గ‌ట్టుగా సినిమా నిర్మాణంలో, చిత్రీక‌ర‌ణ‌లో కీల‌క మార్పులు చోటు చేసుకున్నాయి. త‌మిళ సినీ రంగంలో క్రియేటివిటీకి పెద్ద పీట వేస్తున్నారు. ఇందులో భాగంగా సాంకేతిక నిపుణుల‌కు కొదువ లేకుండా పోయింది. అలాంటి వారిలో ఒక‌డు మ‌తిమార‌న్ పుగ‌ళేంది. త‌ను తాజాగా తీసిన చిత్రం మందాడి. ఇది పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వ‌స్తోంది.

Mandadi Movie Updates

గ‌తంలో అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన బిగిల్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. దేశ వ్యాప్తంగా భారీ ఆద‌ర‌ణ‌ను చూర‌గొంది. కాసులు కొల్ల‌గొట్టింది. ఇక మందాడి మూవీ ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ ప‌తాకంపై రూపొందుతోంది. ఇక ద‌ర్శ‌కుడు మతి మార‌న్ గ‌తంలో త‌ను తీసిన సెల్ఫీ సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. దీంతో ప్ర‌స్తుతం తీస్తున్న మందాడిపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇందులో టాలీవుడ్ హీరో సుహాస్(Suhas) తొలిసారిగా త‌మిళ చిత్రంలో న‌టిస్తుండడం.

మందాడి సినిమాలో సూరి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుండ‌గా మ‌రో పాత్ర‌లో సుహాస్ క‌నిపిస్తుండ‌డం విశేషం. హీరోయిన్ గా మ‌హిమా నంబియార్ న‌టిస్తోంది. దీనిని అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునేలా తీసే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. ఇటీవ‌లే సూరి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు మూవీ మేక‌ర్స్. తాజాగా మ‌రో హీరో సుహాస్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు. ఇది యూత్ ను ఆక‌ట్టుకునేలా ఉంది. లుంగీ , నెర‌సిన జ‌ట్టు, జెర్సీ వేసుకున్న సుహాస్ కు మంచి మార్కులు ప‌డ‌డం ఖాయం.

Also Read : Beauty Bhagyashri Borse :రౌడీ మూవీనైనా భాగ్య‌శ్రీ బోర్సేను గ‌ట్టెక్కిస్తుందా ..?

CinemaSuhasUpdatesViral
Comments (0)
Add Comment