Sukesh Chandrashekhar : జాక్వెలిన్ బర్త్ డే కి ఖరీదైన బహుమతి బహుకరించిన సుఖేష్

ఆర్ధికమోసాలతో వందలకోట్లు సంపాదించినట్టు సుఖేశ్‌పై కేసులు నమోదయ్యాయి...

Sukesh Chandrashekhar : మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీ జైల్లో ఉన్న మాయగాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌ బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ను మరోసారి ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. జాక్వెలిన్‌ బర్త్‌డే సందర్భంగా స్పెషల్‌ గిఫ్ట్‌ పంపిస్తునట్టు వెల్లడించాడు. ఎవరు ఊహించని రీతిలో ఖరీదైన నౌకను ఆమెకు బహుమతిగా పంపిస్తునట్టు తెలిపాడు. మరోసారి జైలు నుంచి జాక్వెలిన్‌కు లేఖ రాశాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌. నౌకకు లేడీ జాక్వెలిన్‌గా నామకరణం చేసినట్టు తెలిపాడు. అంతేకాదు జాక్వెలిన్‌ అభిమానులకు కూడా 100 ఐఫోన్లను గిఫ్ట్‌గా పంపిస్తునట్టు వెల్లడించాడు. 200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో జైల్లో ఉన్న సుఖేశ్‌ తరచుగా జాక్వెలిన్‌(Jacqueline Fernandez)కు లేఖలు రాస్తున్నాడు. గతంలో సుఖేశ్‌ ఇచ్చిన బహుమతుల కారణంగానే చాలా ఇబ్బందులు పడ్డారు జాక్వెలిన్‌. ఈడీ విచారణకు కూడా ఆమె హాజరుకావాల్సి వచ్చింది. ఇప్పుడు లేడీ జాక్వెలిన్‌’ పేరుతో ఖరీదైన యాట్‌ను బహుమతిగా ఇస్తానని ప్రకటించడం మరింత సంచలనం రేపుతోంది.

Sukesh Chandrashekhar…

ఆర్ధికమోసాలతో వందలకోట్లు సంపాదించినట్టు సుఖేశ్‌పై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం జైల్లో ఉన్న అతడు.. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌పై తన అభిమానాన్ని చాటుతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే పుట్టినరోజు చేసుకుంటున్న ఆమెకు ప్రత్యేక గిఫ్ట్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. 2021లో జాక్వెలిన్‌ ఎంచుకున్న లగ్జరీ విహార నౌకను బహుమతిగా ఇస్తున్నట్లు చెప్పాడు. అయితే, నౌక ఈ నెలలో చేరుతుందని, దానికి అన్ని పన్నులు ఇప్పటికే చెల్లించానన్నాడు. సుఖేశ్‌ లేటెస్ట్‌ గిఫ్ట్‌పై జాక్వెలిన్‌ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Also Read : Aishwarya Rai : వారిపై వస్తున్న విడాకుల రూమర్స్ కి స్పందించిన అభిషేక్

BreakingJacqueliene FernandezUpdatesViral
Comments (0)
Add Comment