Sukhee Movie : సుఖీ శిల్పా శెట్టి ఖుషీ

ఓ మ‌హిళ బ్యూటీఫుల్ జ‌ర్నీ

Sukhee Movie : అన్ని అడ్డంకులను ఎదుర్కొంటూనే బాలీవుడ్ న‌టి శిల్పా శెట్టి త‌ను న‌టిగా ప్రూవ్ చేసుకునే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఆమె తాజాగా సుఖీ పేరుతో ముందుకు వ‌చ్చింది. బాలీవుడ్ లో ఇప్ప‌టి వ‌ర‌కు భిన్న‌మైన పాత్ర‌లు పోషించి మెప్పించింది.

యోగా ట్రైన‌ర్ గా కూడా పేరు పొందింది. బుల్లి తెర పై స‌త్తా చాటింది. హోస్ట్ గా ప‌ని చేసింది. ఇదే స‌మ‌యంలో బ్లూ ఫిలిం మాఫియాలో త‌న భ‌ర్త రాజ్ కుంద్రాకు ప్ర‌మేయం ఉన్న‌ట్లు ఆ మ‌ధ్య‌న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

Sukhee Movie Updates

ఈ త‌రుణంలో శిల్పా శెట్టి(Shilpa Shetty) తీవ్ర మాన‌సికంగా ఇబ్బంది ప‌డ్డారు. అయినా ఇన్నింటిని త‌ట్టుకుని ధైర్యంగా నిల‌బ‌డ్డారు. త‌న త‌ల్లి త‌న‌కు అండ‌గా నిలిచింద‌ని తెలిపారు. తాజాగా తాను న‌టించిన సుఖీ మూవీకి సంబంధించి ట్రైల‌ర్ విడుద‌లైంది.

సుఖీ చిత్రంలో శిల్పా శెట్టి కుంద్రా , కుషా క‌పిల‌, చైత‌న్య చౌద‌రి, అమిత్ సాద్ న‌టించారు ఇందులో . క‌థ ప‌రంగా చూస్తే 38 ఏళ్ల పంజాబీ గృహిణి సుఖ్ ప్రీత్ సుఖీ క‌ల్రా త‌న రోజూ వారీ , ప్రాపంచిక జీవితంతో విసిగి పోయింది.

ఏడు రోజుల వ్య‌వ‌ధిలో త‌న అనుభ‌వాల‌ను పేర్కొన్నారు. తిరిగి పుంజుకుని పున‌ర్జ‌న్మ పొంద‌డ‌మే దీని ప్ర‌ధాన క‌థ‌. చాలా కాలం త‌ర్వాత సినిమాలో న‌టిస్తుండ‌డంతో భారీ హోప్స్ పెట్టుకున్నారు శిల్పా శెట్టి.

Also Read : Saira banu : దిలీప్ కుమార్ లా షారుక్ ఖాన్

Comments (0)
Add Comment