ఓటీటీలో దూసుకు పోతున్న అన‌గ‌న‌గా

న‌టీ న‌టుల న‌ట‌న‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చాలా కూల్ గా త‌న ప‌ని తాను చేసుకుంటూ పోయే న‌టుడు సుమంత్. త‌ను ఆ మ‌ధ్య‌న శేఖ‌ర్ క‌మ్ముల తీసిన గోదావ‌రిలో క‌నిపించాడు. ఇందులో క‌మ‌లిని ముఖ‌ర్జీ హీరోయిన్ గా న‌టించింది. కానీ ఎక్క‌డా అస‌భ్య‌త‌, బూతులు లేకుండా సాఫీగా సాగి పోతుంది. మ‌న‌సుకు ఆహ్లాదం క‌లిగించే స‌న్నివేశాలు. ప్ర‌త్యేకించి గోదావ‌రిని భిన్నంగా చూపించాడు. సినీ ఇండ‌స్ట్రీలో కొంత మంది ద‌ర్శ‌కులు మాత్రం త‌మ లోకంలో తాము ఉంటూనే త‌మ‌కు న‌చ్చిన‌ట్టు మూవీస్ తీస్తున్నారు.

వారిలో వంశీ ఒక‌డు కాగా మ‌రొక‌రు శేఖ‌ర్ క‌మ్ముల‌. త‌ను తీసిన చిత్రం త‌ర్వాత కొంత గ్యాప్ తీసుకున్నాడు సుమంత్. త‌ను కూడా ఇంట్రావ‌ర్ట్. క‌థ న‌చ్చితేనే ఓకే చెబుతాడు లేదంటే మౌనంగా ఉంటాడు. తాజాగా త‌ను ముఖ్య పాత్ర పోషించిన చిత్రం అన‌గ‌న‌గా. ఇది ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. పాజిటివ్ టాక్ ను స్వంతం చేసుకుంది. వాణిజ్య ప‌రంగా డ‌బ్బులు వ‌చ్చాయో లేదో తెలియ‌దు కానీ చిత్రం అద్భుతంగా ఉందంటూ టాక్ వినిపిస్తోంది. ఇదే స‌మ‌యంలో ఓటీటీలోకి వ‌చ్చేసింది.

దీనిని ఈటీవి విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్ర‌తి ఒక్క‌రికి న‌చ్చేలా ఉంది. ఇంటిల్లిపాది హాయిగా క‌లిసి చూసి ఆనందించే చిత్రం అన‌గ‌న‌గా. చిత్రీక‌ర‌ణ‌, సంభాష‌ణ‌లు, న‌టీ న‌టుల హావ‌భావాలు మ‌న‌ల్ని క‌దిలించి వేస్తాయి. ఇలాంటి సినిమా తీసిన నిర్మాత‌కు, ద‌ర్శ‌కుడికి అభినంద‌న‌లు తెలియ చేయాలి. ఇలాంటి మూవీస్ రావ‌డం చాలా త‌క్కువ‌. వ‌చ్చినా ఆద‌రించే వారు లేరు. ఇక అన‌గ‌న‌గా చిత్రాన్ని ఓటీటీలో బాగా ఆద‌రిస్తున్నార‌ని తేలింది. శుభ ప‌రిణామం అని చెప్ప‌క త‌ప్ప‌దు.

Comments (0)
Add Comment