Hero Sunny Deol-Randeep :సన్నీషేక్ ర‌ణ‌దీప్ రాక్ ‘జాట్’ ఝ‌ల‌క్

బాలీవుడ్ లో ట్రైల‌ర్ కేక

Sunny Deol : టాలీవుడ్ లో ద‌మ్మున్న డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని. త‌న టేకింగ్, మేకింగ్ చాలా డిఫ‌రెంట్ గా ఉంటుంది. త‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. క‌థ‌ను తెర‌కెక్కించ‌డంలో మ‌రింత క‌సిగా ఉంటాడు. త‌న‌కు న‌చ్చిన హీరో దొరికితే ఇక రెచ్చి పోవ‌డం ఖాయం. త‌ను హిందీలో తీసిన చిత్రం జాట్. ఈ మూవీకి సంబంధించి ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. ఒళ్లు గ‌గుర్పొడిచేలా ఉంది. అద్భుత‌మైన డైలాగులు, స‌న్ని డియోల్(Sunny Deol), ర‌ణ దీప్ హూడా లాంటి న‌టుల ప్ర‌ద‌ర్శ‌న హైలెట్ గా నిలిచింది.

Sunny Deol-Randeep Hooda Movie

వీరితో పాటు వినీత్ కుమార్ సింగ్, రెజీనా క‌సాండ్రా, శైవ‌మి ఖేర్, స్వ‌రూపా ఘోష్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇక ఎప్ప‌టి లాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వ‌డంలో పేరున్న ఎస్ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్నారు. న‌వీన్ యెర్నేని, ర‌వి శంక‌ర్ తో పాటు టీజీ విశ్వ ప్ర‌సాద్ కు చెందిన పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తుండ‌డం మ‌రింత అంచ‌నాలు పెంచేలా చేసింది.

మ‌రోసారి త‌న మార్క్ ఏమిటో చూపించాడు గోపీచంద్ మ‌లినేని. త‌ను గ‌ట్స్ క‌లిగిన డైరెక్ట‌ర్. అత‌డికి స‌న్నీ డియోల్ తోడ‌య్యాడు. మ‌రో వైపు డి మూవీతో త‌న స్టామినా ఏమిటో చూపించిన న‌టుడు ర‌ణ దీప్ హూడా. రాక్ష‌సుడి లాంటి విల‌న్ ..త‌న‌ను ఢీకొనే బ‌లం క‌లిగిన హీరో మ‌ధ్య జ‌రిగే ఒళ్లు గ‌గుర్పొడిచే స‌న్నివేశాల‌తో తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు. ర‌ణ దీప్ హూడా విల‌న్ గా న‌టిస్తుండ‌డం విశేషం. ఈ గ‌నుక బ్లాక్ బ‌స్ట‌ర్ అయితే ఇక బాలీవుడ్ లో గోపీచంద్ కు తిరుగుండ‌దు.

Also Read : Hero Manchu Vishnu : నిత్యం శివ నామ స్మ‌ర‌ణ చేస్తున్నా

CinemaJaatRandeep HoodaSunny DeolTrendingUpdates
Comments (0)
Add Comment