Suriya 44: ‘సూర్య 44’ ఫస్ట్ గ్లింప్స్‌ అదుర్స్‌ !

‘సూర్య 44’ ఫస్ట్ గ్లింప్స్‌ అదుర్స్‌ !

Suriya 44: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న సినిమా ‘సూర్య 44’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాకు ‘పిజ్జా, పేటా, జిగర్‌ తండా, జిగర్‌ తండా డబుల్‌ ఎక్స్‌’ వంటి హిట్‌ చిత్రాల దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘లవ్‌… లాఫ్టర్‌… వార్‌…’ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు గతంలో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్‌ ద్వారా తెలిపారు. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కార్తీక్‌ సుబ్బరాజు స్టోన్‌ బెంచ్‌ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సూర్య సరసన పూజా హెగ్డే నటిస్తోంది.

Suriya 44 Movie Updates

అయితే ‘సూర్య 44’ సినిమా షూటింగ్ ప్రారంభమైందని తెలియజేస్తూ చిత్ర యూనిట్ సోషల్‌ మీడియా వేదికగా గ్లింప్స్‌ విడుదల చేసింది. సూర్యపై చిత్రీకరించిన ఫస్ట్‌ షాట్‌ ఆకట్టుకునేలా ఉంది. హీరో లుక్‌, హావభావాలు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం సూర్య 44 ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Also Read : Adah Sharma: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ ఇంటిని గుడిగా మార్చిన అదా శర్మ !

karthik subbarajPooja HegdeSuriya
Comments (0)
Add Comment