Taapsee Pannu Shocking :ఇన్‌ఫ్లూయెన్సర్ సూసైడ్ తాప్సీ కామెంట్స్

సోష‌ల్ మీడియా అత్యంత ప్ర‌మాద‌క‌రం

Taapsee Pannu : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి తాప్సీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఆమె సోష‌ల్ మీడియా గురించి జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది. దానితో ఒక్క‌సారి అనుసంధానం అయితే ఇక కాలం ప‌ట్ల‌, బంధువులు, స్నేహొతుల ప‌ట్ల ప్రేమ కూడా ఉండ‌ద‌ని వాపోయింది. ఏదైనా కొంత వ‌ర‌కు వాడితేనే బాగుంటుంద‌ని అదే స‌ర్వ‌స్వం అని న‌మ్మితే చివ‌ర‌కు నిరాశ త‌ప్ప ఏమీ మిగ‌ల‌ద‌ని పేర్కొంది. తాజాగా ముంబైకి చెందిన ఇన్ ఫ్ల్యూయెన్స‌ర్ మిషా అగ‌ర్వాల్ సూసైడ్ చేసుకుంది. దీనికి కార‌ణం ఏమిటంటే సామాజిక మాధ్య‌మాల‌లో త‌న‌కు ఫాలోవ‌ర్స్ త‌గ్గ‌డ‌మేన‌ని కుటుంబీకులు చెప్ప‌డం విస్తు పోయేలా చేసింది.

Taapsee Pannu Shocking Comments on Influencer Suicide

ప్ర‌స్తుతం యువ‌త నుంచి అన్ని వ‌ర్గాల వారంతా సోష‌ల్ మీడియాకు ఎడిక్ట్ అవుతున్నారు. డ్ర‌గ్స్, పోర్న్, గేమ్స్, మ‌ద్యం లాంటి స‌వాల‌క్ష అవ‌ల‌క్ష‌ణాల బారిన ప‌డి విలువైన కాలాన్ని కోల్పోతున్నారంటూ తీవ్ర స్థాయిలో మండి ప‌డింది తాప్సీ(Taapsee Pannu). ఆశ‌లు క‌లిగి ఉండ‌డం మంచిదే. కానీ అది స‌మాజానికి మేలు చేకూర్చేలా ఉండాలి త‌ప్పా జీవితాల‌ను కోల్పోయేలా ఉండ కూడ‌ద‌ని సూచించింది. ఒక ర‌కంగా మిషా అగ‌ర్వాల్ సూసైడ్ చేసుకోవ‌డం త‌న‌ను చాలా బాధ‌కు గురి చేసింద‌న్నారు.

ఈ సంద‌ర్బంగా సోష‌ల్ మీడియా గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. తాను ఏనాడో అనుకున్నాన‌ని ఇలాంటి వార్త వినాల్సి వ‌స్తుంద‌ని పేర్కొంది. ఇక నుంచైనా యువ‌త ముందు తాము స్థిర‌ప‌డ‌టం పై ఫోక‌స్ పెట్టాల‌ని, క‌ష్ట‌ప‌డ‌కుండా డ‌బ్బులు సంపాదించాల‌ని అనుకోవ‌డం, గుర్తింపు తెచ్చు కోవాల‌ని చూడ‌టం మంచిది కాద‌ని త‌న సూసైడ్ ద్వారా తెలుస్తుంద‌ని తాప్సీ హెచ్చ‌రించింది.

Also Read : Hero Mahesh Babu Son :పాకిస్తాన్ పాప‌తో ప్రిన్స్ స‌న్ వైర‌ల్ 

CommentsShockingTaapsee PannuUpdatesViral
Comments (0)
Add Comment