Odela 2 : ప్రకటించిన తేదీ కంటే ముందే విడుదలైంది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కీలక పాత్రలో నటించిన ఓదెల2 సీక్వెల్ మూవీ. ఆశించిన మేర ఆకట్టుకోలేక పోయింది. సాధువుగా ఇందులో నటించింది తొలిసారిగా. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దీనిని తెరకెక్కించారు మూవీ మేకర్స్. ఓదెల 2కు రచన, కథనం మొత్తం సంపత్ నంది చూశాడు. అశోక్ తేజ దీనికి దర్శకత్వం వహించాడు. ఇక తమన్నా తన కెరీర్ లో తొలిసారిగా డిఫరెంట్ రోల్ పోషించింది. ఈ మధ్య కాలంలో భారతీయ సినిమా పూర్తిగా మైథలాజికల్, డివోషనల్ కేటగిరీలో ఎక్కువగా మూవీస్ వస్తున్నాయి.
Tamannaah Odela 2 Movie Updates
ఈ తరుణంలో వచ్చిందే ఓదెల2(Odela 2). తనతో పాటు వశిష్ట ఎన్ సింహాతో పాటు హెబా పటేల్ కూడా కీలక పాత్రలలో నటించారు. కథా పరంగా చూస్తే పెళ్లి రాత్రి వధూవరులను తిరుపతి అపమరించి దారుణంగా హత్య చేస్తాడు. అతడి భార్య తనను చంపుతుంది. ఆమెను అరెస్ట్ చేసి శిక్ష విధిస్తారు. ఓదెలా గ్రామస్తులు తిరుపతిని కలిసి పాతి పెడతారు. ఇక పీడ విరుగడైందని అనుకున్నారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఎదురవుతుంది. తన ఆత్మ ప్రతీకారంగా మారుతుంది.
ఆత్మ విశ్రాంతి తీసుకున్నట్లు అనిపించడంతో గ్రామస్తులు ఉపశమనం పొందారు. వేడుకలు చేసుకోవడం ప్రారంభించారు. రెండు పెళ్లిళ్లు ప్లాన్ చేశారు. కానీ దుష్ట ఆత్మ మరో శరీరాన్ని కలిగి తిరిగి వచ్చింది. కొత్తగా పెళ్లైన వధువులను అత్యాచారం చేసి హత్య చేస్తుంది. తిరుపతి ఆత్మ తిరిగి వచ్చిందని గ్రామస్తులు ఎప్పుడు గ్రహిస్తారు..? గ్రామాన్ని శాపం నుండి విడిపించేందుకు నాగ సన్యాసి భైరవి ఎవరు అనేది తెలుసు కోవాలంటే ఓదెల2 చూడాలి.
Also Read : Srikanth Kandragula Shocking :ప్లీజ్ సూత్రవాక్యానికి మద్దతు ఇవ్వండి