Beauty Tamannaah-Odela 2 :మిల్కీ బ్యూటీ మూవీ ఓదెల‌2 డేట్ ఫిక్స్

ఏప్రిల్ 17న రిలీజ్ కు రెడీన‌ని ప్ర‌క‌ట‌న

Odela 2 : ఇటు తెలుగులో అటు బాలీవుడ్ లో బిజీగా ఉంది మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా. ఇక దేశ వ్యాప్తంగా పీరియాడిక‌ల్ క‌థ‌ల‌కు ఎక్కువ ఆద‌ర‌ణ ఉంటోంది. ఇదే స‌మ‌యంలో తెలుగులో వ‌స్తున్న చిత్రం ఓదెల 2(Odela 2) . ఇందులో నాగ సాధువుగా ప‌ల‌క‌రించేందుకు వ‌స్తోంది ఈ ముద్దుగుమ్మ‌. అనిల్ రావిపూడి తీసిన ఎఫ్ 2 లో కెవ్వు కేక అనిపించింది. ఆ త‌ర్వాత ర‌జ‌నీకాంత్ తో న‌టించి మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఈ మ‌ధ్య‌నే ప్రేమికుడు విజ‌య్ వ‌ర్మ‌కు క‌టీఫ్ చెప్పింది. ఇక నుంచి సినిమాల పైనే ఫోక‌స్ పెడ‌తానంటూ ప్ర‌క‌టించింది.

Tamannaah-Odela 2 Movie Release Updates

ఓ వైపు సినిమాలు చేస్తూనే ఇంకో వైపు వెబ్ సీరీస్ లో క‌నిపిస్తూ వ‌స్తోంది. తాజాగా న‌టించిన చిత్రం ఓదెల‌2 . ఇప్ప‌టికే ఈ మూవీపై అంచ‌నాలు పెరిగాయి. అద్భుతంగా తెర కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. కొంత గ్యాప్ త‌ర్వాత వ‌స్తున్న స్ట్రెయిట్ చిత్రం కావ‌డంతో దీనిపై పూర్తి న‌మ్మ‌కంతో ఉంది త‌మ‌న్నా భాటియా. రిలీజ్ అయిన టీజ‌ర్, పోస్ట‌ర్స్ కు సూప‌ర్ రెస్పాన్స్ రావ‌డంతో నిర్మాత‌, ద‌ర్శ‌కుడు న‌మ్మ‌కంతో ఉన్నారు.

ఇక మూవీకి సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చేసింది. వ‌చ్చే నెల ఏప్రిల్ 17న ముహూర్తం ఫిక్స్ చేశామ‌ని, సినిమాను రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ నెలాఖ‌రు నుంచే సినిమాకు సంబంధించిన ప్ర‌మోష‌న్స్ ప్రారంభిస్తామ‌న్నారు. మ‌రో ప్ర‌చారం జ‌రుగుతోంది. భారీ ధ‌ర‌కు ఓదెల 2 చిత్రం ఓటీటీ హ‌క్కులు ఓ సంస్థ తీసుకుంద‌ని స‌మాచారం. ఏకంగా రూ. 11 కోట్ల‌కు అమ్మిన‌ట్లు తెలిసింది. ఒక ర‌కంగా చిత్ర ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు పండ‌గే న‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. త్వ‌ర‌లో ఇది కూడా ప్ర‌క‌టించే ఛాన్స్ ఉంది.

Also Read : Nidhhi Agerwal Shocking :నో డేటింగ్ పై నిధి అగ‌ర్వాల్ షాకింగ్ కామెంట్స్

CinemaOdela 2ReleaseTamannaah BhatiaTrendingUpdates
Comments (0)
Add Comment