IPL 2025 Sensational :ఫ్యాన్స్ కు ఖుష్ ఖ‌బ‌ర్ ఐపీఎల్ రీ స్టార్ట్

ప్ర‌క‌టించిన భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు

IPL 2025 : ముంబై – భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ముంబైలోని ప్ర‌ధాన కార్యాల‌యంలో కీల‌క స‌మావేశం జ‌రిగింది. ప్ర‌ధాన అంశాలు చ‌ర్చించారు. భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఉన్న‌ట్టుండి షాక్ ఇస్తూ టాటా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025ని నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు బీసీసీఐ జాతీయ కార్య‌ద‌ర్శి జే షా. ఆట‌గాళ్ల భ‌ద్ర‌తా దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపారు.

IPL 2025 Restart update Sensational

ఇదిలా ఉండ‌గా ఇరు దేశాల మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ ప్ర‌క‌టించ‌డంతో బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఐపీఎల్ ను రీ స్టార్ట్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు జే షా. ఇందులో భాగంగా మే 17 నుంచి మే17 నుంచి ఐపీఎల్ తిరిగి ప్రారంభం కానుంద‌ని ప్ర‌క‌టించారు. మిగిలి పోయిన మ్యాచ్ ల‌కు సంబంధించి మొత్తం ఆరు వేదిక‌ల‌ను ఖ‌రారు చేసిన‌ట్లు తెలిపారు.. అహ్మదాబాద్, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, బెంగళూరు స్టేడియాల్లో మిగిలిన మ్యాచులు నిర్వ‌హిస్తామ‌న్నారు. ఇదిలా ఉండ‌గా జూన్ 3న ఐపీఎల్ ఫైన‌ల్స్ జరుగ‌తాయ‌ని బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా స్ప‌ష్టం చేశారు

Also Read : PM Modi Strong Warning :పాకిస్తాన్ తోక జాడిస్తే తాట తీస్తాం

BCCIIPL 2025UpdatesViral
Comments (0)
Add Comment