TDP Mahanadu : దివంగత సీఎం నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ మరో చరిత్ర సృష్టించేందుకు సిద్దం అవుతోంది. రాయలసీమలో తొలిసారిగా మహానాడును నిర్వహించేందుకు సిద్దమైంది. ఇదే విషయాన్ని ప్రకటించారు టీడీపీ చీఫ్, సీఎం నారా చంద్రబాబు నాయుడు. మహానాడు సన్నాహక సమావేశాన్ని తన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు, బాధ్యులను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు.
TDP Mahanadu in Kadapa Viral
అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని(TDP) అన్నారు. గత పాలకులు రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తాము వచ్చాక సీన్ మార్చామన్నారు. ఇవాళ ఏపీ అన్ని రంగాలలో దూసుకు పోతోందని చెప్పారు. ఇదిలా ఉండగా ఈసారి నిర్వహించ బోయే పార్టీ మహానాడును నభూతో నభవిష్యత్ అన్న రీతిలో చేపట్టాలని పిలుపునిచ్చారు.
మహానాడుకు హాజరయ్యే ప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు వసతి, రవాణాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని చంద్రబాబు సూచించారు. పార్టీ సిద్దాంతాలు, నాలుగు దశాబ్దాల ప్రయాణంలో సాధించిన విజయాలు, నేడు ప్రభుత్వ విజయాలు మహానాడులో విస్తృతంగా చర్చించాలని సిఎం సూచించారు.
మొదటి రోజు పార్టీ పరమైన అంశాలపై, రెండోరోజు ప్రభుత్వ పరంగా అమలు చేసిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించాలన్నారు. మూడో రోజు లక్షలాది మందితో భారీ బహిరంగ సభ ఉంటుందని, ఎక్కడ ఎవరికీ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి అందరికీ అవగాహన కలిగించేలా తీర్మానాలు ఉండాలని చంద్రబాబు తెలిపారు. మినీ మహానాడును ఈ నెల 18, 19, 20వ తేదీల్లో అన్ని నియోజకవర్గాల్లో, 22, 23 వ తేదీల్లో పార్లమెంట్ల వారీగా నిర్వహించాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు.
Also Read : TDP Mahanadu Sensational :కడపలో తోలిసారిగా టీడీపీ మహానాడు
TDP Mahanadu Interesting :తెలుగుదేశం ప్రస్థానం చారిత్రాత్మకం
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు