Odela 2 : తమన్నా భాటియా కీలక పాత్ర పోషించిన మూవీ ఓదెల 2(Odela 2). ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. ఇదిలా ఉండగా మూవీలో తమ కులం పట్ల అభ్యంతకరమైన సన్నివేశాలు ఉన్నాయంటూ పిచ్చ గుంట్ల కులానికి చెందిన వారు రాష్ట్ర బీసీ కమిషన్ ను ఆశ్రయించారు. ఈ మొత్తం వ్యవహారంపై సీరియస్ అయ్యింది కమిషన్. సినిమా సామాజిక బాధ్యతను ప్రేరేపించేలా ఉండాలి కానీ ఒక సామాజిక వర్గాన్ని కించ పరిచేలా చేస్తే ఎలా అని ప్రశ్నించింది. ఇది మంచి పద్దతి కాదని పేర్కొంది. వెంటనే సెన్సార్ బోర్డు సదరు సన్నివేశాలను, డైలాగులను వెంటనే తొలగించాలని స్పష్టం చేసింది.
Tamannaah Odela 2 Movie Shocking
అంతే కాకుండా ఓదెల 2లో కులం పేరుతో ఉన్న అభ్యంతరకరమైన దృశ్యాలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ కమిషనర్ కు బీసీ కమిషన్ ఫిర్యాదు చేసింది. అదేవిధంగా ఆయా సన్నివేశాలను తొలగించాలంటూ సూచించింది. ఈ నెల విడుదలైన ఓదెల-2(Odela 2) సినిమాలో ఒక వివాహ సన్నివేశంలో సర్పంచ్ 116 రూపాయలు కానుక రాయించిన విషయమై జరిగిన వాద ప్రతివాదనలో పిచ్చగుంట్ల కులం పేరును అభ్యంతరకరంగా వాడినట్టు తమ దృష్టికి వచ్చిందని బీసీ కమిషన్ పేర్కొంది.
ఈ విషయంపై పిచ్చగుంట్ల కులానికి చెందిన పి.మల్లేష్ అనే వ్యక్తి బీసీ కమిషన్ ను ఆశ్రయించాడు. ఫిర్యాదు చేశాడు. ఆ సన్నివేశంలోని అభ్యంతరకర పదాలను తొలగించాలని ఆదేశించింది . ఈ విషయమై కమిషన్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఒక లేఖ రాసింది. వెంటనే దర్యాప్తు చేసి.. ఆ సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్, రచయిత, ఆ అభ్యంతర పదాలను వాడిన నటులపై చర్యలు తీసుకోవాలని కమిషన్ కోరింది. ఫిలిం సెన్సార్ బోర్డు ఈ అభ్యంతరకర పదాలు ఉన్నటువంటి చిత్రాన్ని, ఆ పదాలు తొలగించకుండా కూడా సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడాన్ని కమిషన్ తప్పు పట్టింది.
ఈ చిత్రం ప్రస్తుతం సినిమా థియేటర్లో నడుస్తున్నందున ఇకపైన జరిగే చిత్ర ప్రదర్శనలో ఈ అభ్యంతర పదాలను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేసింది. తెలంగాణ డిజిపి కి కూడా ఈ ఉత్తరం కాపిని పంపిస్తూ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అయితే ఈ వ్యవహారంపై స్పందించిన సెన్సార్ బోర్డు ప్రాంతీయ అధికారి రాహుల్ గౌలీకర్ ఆ సన్నివేశంలోని అభ్యంతరకర పదాలను తొలగిస్తామని హామీ ఇచ్చారు.
Also Read : AR Rahman Shocking Comment :విమర్శించే వారంతా నా కుటుంబీకులే