Terachapa : అనన్య క్రియేషన్స్ బ్యానర్ పై కైలాష్ దుర్గం నిర్మించిన చిత్రం తెరచాప(Terachapa). ఈ మూవీకి జోయెల్ జార్జ్ దర్శకత్వం వహించారు. కథ, స్క్రీన్ ప్లే రాశారు. సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ లాంచింగ్ కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్, నటుడు కార్తీక్ రత్నం. ఇందులో నటించిన ప్రతి ఒక్కరు వంద శాతం ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు. సాధ్యమైనంత మేరకు కంటెంట్ బాగుండేలా చూసుకున్నాం. దీంతో సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందన్న నమ్మకం తమకు ఉందన్నారు డైరెక్టర్.
Terachapa Movie Teaser Sensational
ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన పృథ్వీ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెరచాప అద్భుతమైన సినిమా. నవీన్ దీని కోసం చాలా కష్టపడ్డాడు. తను ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయలేదు. చివరకు ఆస్పత్రి పాలయ్యాడు. సినిమా పట్ల , వృత్తి పట్ల తనకు ఉన్న నిబద్దతను, అంకిత భావాన్ని తెలియ చేస్తుందన్నాడు. తను తెర మీద సినిమాను సూపర్ గా వచ్చేలా చేయడంలో కీలక పాత్ర పోషించాడన్నారు.
ఇక నవీన్ కు సంబంధించి చెప్పాలంటే తమిళ సినీ ఇండస్ట్రీలో చియాన్ విక్రమ్ లాంటి నటుడిగా ఎదుగుతాడని ప్రశంసలు కురిపించాడు పృథ్వీ రాజ్. తనకు కచ్చితంగా గుర్తింపు లభించి తీరుతుందన్నాడు. దర్శకుడు జార్జ్ మాట్లాడుతూ దీనిని తమిళ సాంస్కృతిక ప్రభావంతో మంచి మాస్ ఎంటర్ టైనర్ గా తీశామన్నాడు. తారాగణం, సాంకేతిక నిపుణులు చాలా కష్ట పడ్డారని అన్నారు. అవుట్ పుట్ అద్భుతంగా ఉందన్నాడు.
Also Read : Hero Vijay Deverakonda-Rashmika :రాహుల్ మూవీలో దేవరకొండ..రష్మిక మందన్న