Thalapathy 68 Vijay : ఎయిర్ పోర్ట్ లో ద‌ళ‌ప‌తి వైర‌ల్

థాయ్ లాండ్ కు ప్ర‌యాణం

Thalapathy 68 Vijay : కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ యాక్ట‌ర్ ద‌ళ‌ప‌తి జోసెఫ్ విజ‌య్. త‌ను క‌దిలినా , ప్ర‌యాణం చేసినా లేదా మాట్లాడినా ఇప్పుడు సెన్సేష‌న్ . ప్ర‌త్యేకించి భారీ ఎత్తున ఫ్యాన్స్ ను స్వంతం చేసుకున్న న‌టుడు. డిఫ‌రెంట్ మేన‌రిజం అత‌డి స్వంతం. ఇప్ప‌టికే త‌ను న‌టించిన లియో చిత్రం స‌క్సెస్ మీట్ లో పాల్గొన్నాడు. ఈ సంద‌ర్బంగా విజ‌య్ చేసిన స్పీచ్ ఇప్పుడు సినీ రంగంలోనే కాదు సోష‌ల్ మీడియాలోనూ షేక్ చేస్తోంది.

Thalapathy 68 Vijay Viral

తాజాగా ద‌ళ‌ప‌తి విజ‌య్(Thalapathy Vijay) వైర‌ల్ గా మారారు. త‌ను కొత్తగా మూవీలో న‌టిస్తున్నారు. ఇందుకు సంబంధించి థాయ్ లాండ్ కు బ‌య‌లు దేరారు. ఎయిర్ పోర్ట్ కు వ‌స్తున్న విష‌యం తెలుసుకున్న ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. దీంతో భారీ ఎత్తున భ‌ద్ర‌త‌ను క‌ల్పించారు.

స్వంత సెక్యూరిటీతో పాటు ప్ర‌భుత్వం త‌ర‌పున ఏర్పాటు చేసిన గ‌న్ మెన్స్ సాయంతో ఎయిర్ పోర్టుకు వెళ్లారు. పెద్ద ఎత్తున విజ‌య్ తో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ ప‌డ్డారు. విచిత్రం ఏమిటంటే త‌ను కారు లో నుంచే ముఖానికి మాస్క్ తో లోప‌లికి వ‌చ్చారు.

ఇక చెకింగ్ స‌మ‌యంలో మాస్క్ తీయాల్సి రావ‌డంతో ఎయిర్ పోర్ట్ మొత్తం అభిమానుల‌తో , ప్ర‌యాణీకుల‌తో నిండి పోయింది. ఇదిలా ఉండ‌గా విజ‌య్ తో వెంక‌ట్ ప్ర‌భు సినిమా తీస్తున్నాడు. షూటింగ్ కోసం థాయ్ లాండ్ కు వెళ్ల‌డం , దీనికి సంబంధించి ఫోటోలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

Also Read : Thalapathy 68 Vijay : ఎయిర్ పోర్ట్ లో ద‌ళ‌ప‌తి వైర‌ల్

Comments (0)
Add Comment