Hero Vijay Meet : ర‌థసార‌థితో ద‌ళ‌ప‌తి ములాఖ‌త్

కేసీఆర్ తో పైడిప‌ల్లి వంశీ భేటీ

Hero Vijay : హైద‌రాబాద్ – త‌మిళ సినీ రంగానికి చెందిన దిగ్గ‌జ న‌టుడు ద‌ళ‌ప‌తి విజ‌య్(Hero Vijay) చ‌ర్చ‌నీయాంశంగా మారారు. ల‌క్ష‌లాది మంది అభిమానుల‌ను క‌లిగిన ఈ న‌టుడు ఈ మ‌ధ్య‌నే పొలిటిక‌ల్ లీడ‌ర్ గా అవ‌తారం ఎత్తారు. రాష్ట్రంలో అవినీతి, అక్ర‌మాల‌కు అడ్డు అదుపు లేకుండా పోయిందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి హైద‌రాబాద్ లో ప్ర‌త్య‌క్షం అయ్యాడు.

Hero Vijay Meet..

మాజీ ముఖ్య‌మంత్రి, ఉద్య‌మ నాయ‌కుడిగా పేరు పొందిన క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావును త‌న నివాసంలో ప్ర‌త్యేకంగా క‌లుసుకున్నారు ద‌ళ‌ప‌తి విజ‌య్. న‌టుడి వెంట ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పైడిప‌ల్లి వంశీ కూడా ఉన్నారు. ఈ భేటీ అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. దేశ వ్యాప్తంగా రాజ‌కీయ వ‌ర్గాల‌లో క‌ల‌క‌లం రేపింది.

ఇద్ద‌రికీ భారీ ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్ర‌స్తుతం బీఆర్ఎస్ ప‌వ‌ర్ లో లేక పోయిన‌ప్పటికీ రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష పాత్ర‌ను స‌మ‌ర్థవంతంగా నిర్వ‌హిస్తూ వ‌స్తోంది. ప్ర‌జా స‌మస్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ ప్ర‌భుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

కాగా ఇటీవ‌లే కొత్త పార్టీని లాంఛ్ చేసిన విజ‌య్ సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. ల‌క్ష‌లాది మంది త‌ర‌లి వ‌చ్చారు స‌భ‌కు. ఈ సంద‌ర్బంగా డీఎంకే, బీజేపీపై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. పేద‌లు, బ‌డుగులు, బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తి కోసం పాటు ప‌డ‌తానంటూ ప్ర‌క‌టించారు. ఈ త‌రుణంలో రాజ‌కీయంగా మ‌రింత వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసేందుకు అనుభ‌వం క‌లిగిన కేసీఆర్ తో సూచ‌న‌లు, స‌ల‌హాలు తీసుకునేందుకు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

Also Read : Victory Venkatesh : నాదంతా వైట్ మ‌నీ – విక్ట‌రీ వెంక‌టేశ్

kcrKey MeetingUpdatesVijay ThalapathyViral
Comments (0)
Add Comment