Thangalaan: ‘తంగలాన్‌’ విడదలకు ముహూర్తం ఫిక్స్ !

'తంగలాన్‌' విడదలకు ముహూర్తం ఫిక్స్ !

Thangalaan: నీలమ్ ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై చియాన్ విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘తంగలాన్‌(Thangalaan)’. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్‌, పార్వతి తిరువోతు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ కార్మికుల జీవితాల ఆధారంగా దర్శకుడు పా రంజిత్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. డీ గ్లామర్ పాత్రలో విక్రమ్ లుక్, గెటప్స్ చూస్తే గతంలో సేతు, శివపుత్రుడు, అపరిచితుడు వంటి క్రేజీ హిట్స్ ను తలపిస్తున్నాయి.

Thangalaan Release Updates

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. కొద్దిరోజుల క్రితం విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ రావడంతో సినిమాపై భారీ బజ్‌ క్రియేట్‌ అయింది. దీనితో ఈ సినిమా కోసం కోలీవుడ్ తో పాటు పాన్ ఇండియాలో అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాను జనవరి 26న విడుదల చేస్తున్నట్లు గతంలో చిత్ర యూనిట్ ప్రకటించినప్పటికీ వివిధ కారణాల వలన వాయిదా పడుతూ వస్తుంది. అయితే ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘తంగలాన్‌’ విడుదల తేదీ ఖరారు అయ్యింది. ఆగష్టు 15న ‘తంగలాన్‌’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారుతోంది.

Also Read : Nag Ashwin: చిన్నారులకు గోల్డెన్ ఛాన్స్‌ ప్రకటించిన కల్కి డైరెక్టర్‌ నాగ్ అశ్విన్ !

Pa RanjithThangalaanvikram
Comments (0)
Add Comment