The Sabarmati Report: ఆశక్తికరంగా ‘ది సబర్మతీ రిపోర్ట్‌’ టీజర్ !

ఆశక్తికరంగా ‘ది సబర్మతీ రిపోర్ట్‌’ టీజర్ !

The Sabarmati Report: దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన గుజరాత్ లోని గోద్రా రైలు దహనకాండ ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ది సబర్మతీ రిపోర్ట్‌’. బాలీవుడ్‌ కథానాయకుడు విక్రాంత్‌ మాస్సే(Vikrant Massey), రాశీ ఖన్నా, రిద్ధి డోగ్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను రంజన్‌ చందేల్‌ తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను మే 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనితో ఈ సినిమా ప్రమోషన్లను షురూ చేసింది చిత్ర యూనిట్.

దీనిలో భాగంగా ‘ది సబర్మతీ రిపోర్ట్‌’ టీజర్ ను తన సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ‘దేశాన్ని కుదిపేసిన ఘటన. భారతీయ చరిత్రను శాశ్వతంగా మార్చేసిన సంఘటన… ‘ది సబర్మతీ రిపోర్ట్‌’ అంటూ సాగే ఈ టీజర్ ఆద్యంతం ఆశక్తికరంగా సాగింది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఫుల్ యాక్ష‌న్ ప్యాక్డ్‌గా సాగిన ఈ టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది.

The Sabarmati Report – గోద్రా రైలు దహనకాండ ఏమిటంటే ?

2002లో ఫిబ్రవరి 27న గుజరాత్‌లోని గోద్రా రైల్వేస్టేషన్ నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లేందుకు సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరుతుండగా ఎవరో చైన్‌ లాగడంతో రైలు నిలిచిపోయింది. ఒక్కసారిగా కొన్ని బోగీలపై రాళ్ల వర్షం మొదలైంది. ఎవరో దుండగులు ఓ బోగీపై పెట్రోల్‌ చల్లి నిప్పు పెట్టారు. దాంతో ఆ బోగీలోని 59 మంది సజీవదహనమయ్యారు. ఈ రైలు అయోధ్య నుంచి తిరిగి వస్తున్న యాత్రికులతో ఉంది. ఆ ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని రూపొందిస్తున్నారు. గోద్రా ఘటన అనంతరం అల్లర్లు గుజరాత్ అంతటా వ్యాపించాయి. ఈ అల్లర్లలో వెయ్యి మందికి పైగా మరణించారు. అప్పట్లో ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Also Read : Thalaivar 171: ఏప్రిల్ 22న రజనీ అభిమానులకు లోకేశ్ కనగరాజ్ సర్ ప్రైజ్ !

Rashi KannaThe Sabarmati ReportVikranth Masse
Comments (0)
Add Comment