Heros Celebrations : హీరోల దీపావ‌ళి సెలబ్రేష‌న్స్

రాముడు..భీముడు..పెద్దోడు..చిన్నోడు

Heros Celebrations : ఓ వైపు తెలుగు సినిమా రంగానికి చెందిన సీనియ‌ర్ న‌టుడు చంద్ర‌మోహ‌న్ అనారోగ్యంతో మృతి చెందితే సంతాపం తెలియ చేయాల్సిన సీనియ‌ర్ న‌టులు, వారి భార్య‌లు దీపావ‌ళి పండుగ‌ను సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఈ పండుగ ఆనందాన్ని మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడు న‌టుడు రామ్ చ‌ర‌ణ్ తేజ ఇంట్లో చోటు చేసుకుంది.

Heros Celebrations Viral

చెర్రీ నివాసంలో టాప్ స్టార్స్ జూనియ‌ర్ ఎన్టీఆర్, విక్ట‌రీ వెంక‌టేశ్, రామ్ చ‌ర‌ణ్ తేజ‌(Ram Charan), ప్రిన్స్ మ‌హేష్ బాబు తో పాటు వారి భార్య‌లు ఇక్క‌డ కొలువు తీరారు. దీపావ‌ళి పండుగ‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా దీపాలు వెలిగించారు. ట‌పాసులు పేల్చారు.

ఆద‌ర్శంగా ఉండాల్సిన న‌టులు ఇలా వ్య‌వ‌హ‌రించ‌డంపై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. ఇక దేశ వ్యాప్తంగా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ రంగాల‌కు చెందిన సినీ న‌టులు, న‌టీమ‌ణులు దీపావ‌ళి సంబురాల్లో మునిగి పోయారు. ప్ర‌స్తుతం న‌టులు వైర‌ల్ గా మారారు.

ఇందుకు సంబంధించి సామాజిక మాధ్య‌మాల‌లో న‌టీ, న‌టుల ఫోటోలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. సెల‌బ్రేష‌న్స్ అంబ‌రాన్ని తాకాయి.

Also Read : Parineeti Chopra : ప‌రిణీతి చోప్రా స్పెష‌ల్ గిఫ్ట్

Comments (0)
Add Comment